Tuesday, January 7, 2025

మహిళలేమైనా కుందేళ్లా ? : రేణుకా చౌదరి

- Advertisement -
- Advertisement -

ప్రతిజంట ముగ్గురు పిల్లలకు జన్మనివ్వాలని ఆర్‌ఎస్‌ఎస్ నేత మోహన్ భాగవత్ పిలుపునివ్వడంపై కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి తీవ్రంగా స్పందించారు. వరుసగా పిల్లలను కనడానికి మహిళలేమైనా కుందేళ్లా ? అని ప్రశ్నించారు. నిరుద్యోగ సమస్యను ఎత్తి చూపుతూ ఖాళీగా ఉన్నవారికి తమ బిడ్డలను ఇచ్చి పెళ్లి చేసేందుకు ఎవరూ సిద్ధంగా లేరని ఓ జాతీయ వార్తా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వూలో వ్యాఖ్యానించారు. నిరుద్యోగులైన యువకులకు ఎవరైనా తమ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయడానికి ఇష్టపడరని, అందువల్లనే నిరుద్యోగులైన యువకులు వివాహాలు చేసుకోలేక పోతున్నారని పేర్కొన్నారు.

ఉద్యోగాలు లేనప్పుడు భాగస్వామిని ఎలా సంరక్షించ గలుగుతారు? వృద్ధ తల్లిదండ్రులే పిల్లల్ని చూసుకోవడంతోపాటు పనులు కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మోహన్ భాగవత్ ఎక్కువ మంది పిల్లల్ని కనాలని చెబుతున్నారు. అలా చెప్పేవాళ్లు ఎంతమంది పిల్లల్ని పెంచగలరు ? అని రేణుకా చౌదరి ప్రశ్నించారు. ఆహార ధరలు, ఆహార కల్తీ, ప్రయాణ ఖర్చులు పెరగడాన్ని ప్రస్తావించిన ఆమె, ఎవరైనా అనారోగ్యంతో ఆస్పత్రి పాలైతే చికిత్సకయ్యే ఖర్చు భారీగా ఉంటోందన్న విషయాన్ని ప్రస్తావించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News