Thursday, January 23, 2025

ఆ కేంద్ర మంత్రి ఒక యూజ్ లెస్ ఫెలో: రేణుకాచౌదరి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి కిరణ్ రిజుజుపై కాంగ్రెస్ ఫైర్‌బ్రాండ్, కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మారియట్ హోటల్‌లో మీడియాతో ఆమె మాట్లాడారు. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు యూజ్ లెస్ ఫెలో, లుచ్చా గాడు ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు. తనపై మోడీ చేసిన వాఖ్యలపై లీగల్‌గా వెళ్ళే ఆలోచనలో ఉన్నానని తెలిపారు. యూ హావ్ నో హార్ట్ మిస్టర్ మోడీ అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ యాక్షన్ ప్లాన్ ఏంటో త్వరలోనే తెలుస్తుందన్నారు. రాహుల్ గాంధీ మాట్లాడేవన్నీ వాస్తవాలే.నన్నారు. రాహుల్ అడిగే వాటికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. షారుఖ్ ఖాన్ ముస్లిం కాబట్టే ఆయన కొడుకుపై డ్రగ్స్ అభాండాలు వేసి అదానీ విషయాలు పక్కతోవ పెట్టించారని విమర్శించారు. అదానీ, మోడీ సంబంధాలపై రాహుల్ ప్రశ్నించగానే ఆయన్ని టార్గెట్ చేశారని పేర్కొన్నారు

. రాహుల్ గాంధీకి ప్రధాని భయపడుతున్నారని తెలిపారు. నిజాలు బయట పడుతున్నాయని రాహుల్‌పై కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. మోడీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని విమర్శించారు. ఫైనాన్షియల్ టైమ్స్‌పై పరువునష్టం దావా వేయొచ్చు కదా అని ప్రశ్నించారు. మోడీ భారతదేశ కంఠాన్ని నొక్కుతున్నారని వెల్లడించారు. రాహుల్ అడిగిన ప్రశ్నలనే రేణుక చౌదరిగా తాను అడుగుతున్నానని చెప్పారు. కేసులు పెట్టినంత మాత్రానా భయపడేది లేదని స్పష్టం చేశారు. తమకు ఎవరూ సర్టిఫికెట్లు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. మోడీని ప్రధాని అనడానికి సిగ్గుగా ఉందని ఎద్దేవా చేశారు. 56 ఇంచుల చెస్ట్ ఉన్నమనిషికి 70 సంవత్సరాలు చేసిన అభివృద్ధి కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. మోడీలెవరూ ఒడిసిలు కాదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఒబిసికి వ్యతిరేకం కాదని చెప్పారు.

డ్రెస్సులు మార్చుకునే వాళ్ళకి దేశభక్తి గురించి ఏం తెలుస్తుందని విమర్శించారు. రాజ్యాంగ విలువలు తెలియని వాళ్ళు కొత్త పార్లమెంట్ భవనాలు కట్టి ఏం లాభమని నిలదీశారు. భారత్ జోడో యాత్ర కాంగ్రెస్ బలోపేతానికి కాదని స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News