Thursday, January 23, 2025

నటుడు పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్‌కి గుండె సమస్య!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గుండె జబ్బుతో బాధపడుతున్నారని సమాచారం. ఆ విషయం ఆమె సన్నిహిత వర్గానికే ఇన్నాళ్లు తెలుసు. ఆరోగ్య సమస్యలను రేణు దేశాయ్ గుండె నిబ్బరంతో నెట్టుకొస్తున్నారని వినికిడి. ప్రస్తుతం ఆమెకు చికిత్స జరుగుతోంది. మందులు వాడుతున్నారు. ఓ ప్రక్క గుండె నిబ్బరంతో నెట్టుకొస్తున్న ఆమె తనలా ఎవరైనా సమస్యలతో బాధపడుతుంటే ధైర్యాన్ని తెచ్చుకోవాలని పోస్ట్ పెట్టారు. ఎట్టి పరిస్థితిలోనూ ధైర్యాన్ని కోల్పోకూడదన్నారు. తన అనారోగ్యం నుంచి త్వరగానే కోలుకుని షూటింగుల్లో పాల్గొంటానని అన్నారు. అయితే ఆమె అనారోగ్యం ఏమిటి వగైరా విషయాలు స్పష్టంగా తెలియడంలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News