Monday, January 20, 2025

రేణుకా స్వామిని కరెంట్ షాక్‌లతో చిత్రహింసలు పెట్టి చంపారు

- Advertisement -
- Advertisement -

 

బెంగళూరు: చనిపోవడానికి ముందు రేణుకా స్వామికి నిందితులు కరెంట్ షాకులు ఇచ్చి హింసించినట్లు పోస్టు మార్టమ్ నివేదిక బయటపెట్టిందని పోలీసు వర్గాలు సోమవారం వెల్లడించాయి. కన్నడ చలన చిత్ర పరిశ్రమకను దిగ్భ్రాంతికి గురిచేసిన రేణుకా స్వామి హత్య కేసులో ఇప్పటివరకు చాలెంజింగ్ స్టార్‌గా పేరుపొందిన దర్శన్ తూగుదీపతోపాటు ఆయన స్నేహితురాలు పవిత్ర గౌడ, మరో 15 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

దర్శన్ అభిమానిగా చెప్పుకున్న చిత్రదుర్గ జిల్లాకు చెందిన రేణుకా స్వామి సోషల్ మీదియాలో పివత్ర గౌడకు వ్యతిరేకంగా అసభ్యకర పోస్టులు పెట్టినందుకు హత్యకు గుచ్యారు. ఈ కేసులో ఇటీవల అరెస్టయిన మాండ్యకు చెందిన కేబుల్ కార్మికుడు ధన్‌రాజ్ తాము రేణుకా స్వామిని ఎలా చిత్రహింసలకు గురిచేసిందీ సంచలన విషయాలు బయటపెట్టినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ కేసులో మరో నిందితుడైన నందీష్ తనను బెంగళూరులోని ఒక గోడౌన్‌కు పిలిస్తే వెళ్లానని, అక్కడ తాము రేణుకా స్వామికి కరెంట్ షాకులు ఇచ్చి చిత్రహింసలకు గురిచేశామని అనుమానితుడు ధన్‌రాజ్ చెప్పాడు.

కరెంట్ షాక్ ఇవ్వడానికి ఉపయోగించిన పరికరాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆటోడ్రైవర్‌గా పనిచేసే రేణుకా స్వామిని జూన్ 8న చిత్రదుర్గ జిల్లాలో కిడ్నాప్ చేసి బెంగళూరుకు తీసుకువచ్చారు. రేణుకా స్వామి మృతదేహం బెంగళూరులోని సుమనహల్లి వంతెన సమీపంలో తర్వాత లభించింది. రేణుకా స్వామిని కిడ్నాప్ చేయడానికి ముందు అతని ఆటోను నిందితులు వెంబడించిన దృశ్యాల సిసిటివి ఫుటేజ్‌లు పోలీసులు సేకరించారు. ఉదయం 9.30 గంటలకు ఇంటి నుంచి బయల్దేరిన రేణుకా స్వామి ఆటోను నిందితులు వెంబడించారు.

ఒక పెట్రోల్ పంపు వద్ద రేణుకా స్వామి ఆటో సిసిటివి కెమెరా కంటపడింది. ఒక తెల్ల స్కూటర్‌లో ఒక వ్యక్తి ఆటోను వెండించడం నిఘా కెమెరాలో చిక్కింది. కిడ్నాప్ కోసం ఉపయోగించినట్లు అనుమానిస్తున్న కారును పోలీసులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. చిత్రదుర్గ జిల్లాలోని అయ్యనహల్లి గ్రామంఓ ఒక ఇంటి ముందు నిలిపిఉన్న కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నిందితులలో ఒకరైన రవి కారును ఆ ఇంటి ముందు పార్కు చేసినట్లు తెలిసింది. రవి కుటుంబాన్ని ప్రశ్నించి కారులో నుంచి అనేక వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News