Wednesday, January 22, 2025

బోనమెత్తిన గవర్నర్ తమిళసై

- Advertisement -
- Advertisement -

పటాన్ చెరు: పటాన్‌చెరు పట్టణ శివారులోని రేణుకా ఎల్లమ్మ తల్లి జాతర ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ జాతర మహోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ తమిళసై తో పాటు హర్యాన గవర్నర్ బండారు దత్తాత్రేయలు హాజరైయ్యారు. దత్తాత్రేయ పుట్టిన రోజు పురస్కరించుకొని మన రాష్ట్ర గవర్నర్ తమిళసై శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గవర్నర్ తమిళసై అమ్మవారి బోనం ఎత్తుకొని మొక్కు చెల్లించుకున్నారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ అమ్మవారి కటాక్షంతో రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని ప్రార్థించారు.

రేణుకా ఎల్లమ్మ దేవతను దర్శించుకొని మొక్కుకోవడం చాల సంతోషంగా ఉందన్నారు. గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ అనుశక్తులపై దైవశక్తుల అనుగ్రహం ఉంటే విజయం సాధిస్తూ అంతా మంచి జరుగుతుందన్నారు. దేవతల అనుగ్రహం ఉండడం వల్లనే కోవిడ్ లాంటివి ఎక్కువ ప్రభావం చూపలేదన్నారు.ఆధ్యాత్మిక దేశంగా మనకు మంచి పేరుందన్నారు.ప్రజలంతా భగవంతుని ధ్యానం చేయాల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పటాన్ చెరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్, మాజీ జెడ్పిటిసి శ్రీకాంత్ గౌడ్, బిజెపి కార్పొరేటర్లు, స్థానిక బిజెపి నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News