Thursday, January 16, 2025

నా కుమారుడే మళ్లీ పుట్టాడు: రేణుకాస్వామి తండ్రి

- Advertisement -
- Advertisement -

కన్నడ నటుడు దర్శన్ తూగుదీప, ఇతరుల చేతుల్లో హత్యకు గురైన రేణుకాస్వామి భౠర్య సహన బుధవారం ఇక్కడి ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మగశిశువుకు జన్మనిచ్చారు. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నట్లు రేణుకాస్వామి తండ్రి కాశీనాథ్ శివనగౌడర్ తెలిపారు. తన కోడలికి ఉచిత చికిత్స అందచేసిన ఆసుపత్రికి, డాక్టర్లకు ధన్యవాదాలు తెలిపిన ఆయన తన కుమారుడే మళ్లీ జన్మించినట్లు ఉందంటూ విలేకరుల వద్ద భావోద్వేగానికి లోనయ్యారు. తన భర్త రేణుకాస్వామి హత్యకు గురైనపుడు సహన ఐదునెలల గర్భవతి.

రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్, అతని స్నేహితురాలు పవిత్ర గౌడ, మరో 15 మంది నిందితులుగా ఉన్నారు. ప్రస్తుతం దర్శన్ బళ్లారి జైలులో ఉండగా పవిత్ర గౌడ బెంగళూరు సెంట్రల్ జైలులో ఉన్నారు. ఇతర నిందితులు రాష్ట్రంలోని వివిధ జైళ్లలో ఉన్నారు. వీరిలో కొందరికి ఇటీవలే బెయిల్ లభించింది. ఈఏడాది జూన్ 9న బెంగళూరులోని సుమనహళ్లి సమీపంలోని మురుగుకాల్వ వద్ద రేణుకాస్వామి మృతదేహం లభించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News