రాజేద్రనగర్: బోనాల ఉత్సవా లు సమీపిస్తున్న రహదారులు కనీస మరమ్మతులకు నో చుకోవడం లేదు. ఆ దిశగా అధికారులు చర్యలకు ఇంకా ఉపక్రమించనట్లుగా తెలుస్తుంది. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని మైలాదేవ్‌పల్లి, రాజేంద్రనగర్, అత్తాపూర్ డివిజన్‌లలోని బస్తీలు, కాలనీలలోని రహదారులు గోతులమయంగా మారాయి. గత కొంతకాలంగా స్థానికులు ఈ సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వం బోనాల ఉత్సవాలను ఎంతో ప్రతిష్మాతకంగా నిర్వహించేందుకు ప్రత్యేక నిధులు మంజూరు చేస్తుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన నాటి నుంచి మన సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేలా బోనాల ఉత్సవాలకు ప్రత్యేక నిధులు విడుదల చేసి అభివృద్ధి, సౌకార్యాలు ప్రభుత్వం కల్పిస్తోంది.
ప్రముఖ ఆలయాలతో పాటు బస్తీలు, కాలనీల్లో దేవాలయ కమిటీలకు తెలంగాణ వచ్చాకే నేరుగా ని ధులు ఇస్తుండడంతో అమ్మవారి ఆలయాలకు రంగులు, అభివృద్ధితో మాతేశ్వరీ ఆలయ ప్రాంగాలకు కొత్త శోభ సమకూరుతోంది. కానీ ఆయా ఆలయాలకు భక్తులు ఊరేగింపుగా తరలే మార్గాలు చాలా చొట్ల గోతుల మయంగా మారాయి. ఆ ఫలితంగా ఉత్సవాల్లో భక్తులు ఇబ్బందులు పడకత తప్పదని పిస్తోంది. బో నాల ఉత్సవాల ప్రారంభానికి మందే ఆయా గో తుల మయంగా ఉన్న రోడ్లు గుర్తించి అధికారులు మరమ్మత్తులు చేయిస్తే బాగుంటుందని భక్తులు కోరుతున్నారు. బోనాలు అంటేనే అమ్మవారి భక్తితో బోనం సమర్పించే ఆనవాయితీ మనది.
బస్తీలు, కాలనీల్లో భక్తులు బొడ్డురాయికి ప్ర త్యేక పూజలు చేసి అక్కడి నుంచి సామూహిక ఊరేగింపుగా బోనాలతో తరలి వెళుతారు. ఊరేగింపు పోడవునా శివసత్తుల పూనకాలు, పోతురాజుల నృ త్యాలు డప్పు వాయిద్యాల నడుమ కొనసాగుతా యి. తొట్టెల, ఫలహారపు బండ్ల ఊరేగింపు బోనాల ఉత్సవాల్లో మరో ఘట్టం. ఈ నేపథ్యంలో భక్తులకు దారి పోడవునా ఏలాంటి ఇబ్బందులు కలుగకుండా గోతుల మయంగా మారిన రహదారులకు మరమ్మతులు లేదా అభివృద్ధి చేయాలని భక్తులు, స్థానిక ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు. ఉదాహరణకు మైలార్‌దేవ్‌పల్లి డివిజన్‌లోని వెంకటేశ్వరా కా లనీ శ్రీ నల్లపోమ్మ దేవాయాలనికి వెళ్ల్లే ప్రధాన రహదారి భారీ గోతులతో అధ్వానంగా ఉంది. వర్షం వస్తే అడుగు మేర నీళ్లు నిలుస్తున్నాయని, అంతర్గత రోడ్లపై మురుగు పారుతుందని స్థానికులు తెలిపారు. ఈ విషయమై స్థానిక అధికారులు స్పందించాలని ఆ కాలనీ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.