Monday, December 23, 2024

వేములూరి లెఫ్ట్ కెనాల్ మరమ్మతు పనులు ప్రారంభం

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట : రైతులు పంట పొలాలకు సంవత్సరాలుగా నీరు అందడం లేదని వేములూరు ప్రాజెక్ట్ లెఫ్ట్ కెనాల్‌కు మరమ్మత్తులు చేయాలని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డిని రైతులు కోరగా యుద్దప్రాతిపదికను పనులను చేపట్టారు. ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఆదేశాల మేరకు లెఫ్ట్ కెనాల్ మరమ్మత్తు పనులను బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు ,మఠంపల్లి సర్పంచ్ శ్రీ నివాస్‌రెడ్డి, జడ్పీటీసీ జగన్‌నాయక్,మండలపార్టీ అద్యక్షుడు ఇరుగు పిచ్చయ్య,మాజీ ఎంపీపీ కొండానాయక్,రైతులతో కలిసి మంగళవారం ప్రారంబించారు.

ఈసందర్బంగా వారు మాట్లాడుతూ 800ఎకరాల సాగునీటి అవసరాల దృష్టా రైతుల అభ్యర్ధన మేరకు ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి వేములూరు లెఫ్ట్ కెనాల్ పనులను చేపట్టడం సంతోషకరమన్నారు. తెలంగాణరాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తుందన్నరు.ఈ కార్యక్రమంలో ఐబీ ఏఈ శ్రీనివాస్,బీఆర్‌ఎస్ నాయకులు సల్వాది సీతారామయ్య, సర్పంచ్‌లు కోలాహలం లక్ష్మీనరసింహరాజు, ఎంపీటీసీలు జ్యోతి అశోక్‌నాయక్, బక్షానాయక్, సైదాకుమారి కాశయ్య,కోలాహలం కృష్ణంరాజు, రమావత్ రవీందర్‌నాయక్, మాజీ సర్పంచ్ సరిత కృష్ణయ్య, ఎస్సీ సెల్ అద్యక్షులు పల్లె మట్టయ్య ,రైతులు ,బీఆర్‌ఎస్‌పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News