ఢిల్లీ: భారత దేశంలో తీసుకొచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నామని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. జాతిని ఉద్దేశించి మోడీ ప్రసంగించారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని, దేశం కోసమే పని చేస్తున్నానని తెలియజేశారు. 22 కోట్ల భూసార పరీక్ష కార్డులను పంపిణీ చేశామని మోడీ ప్రకటించారు. వ్యవసాయ బడ్జెట్ ను ఐదింతలు చేశామని వెల్లడించారు. తాను దేశ భవిష్యత్ కోసం పని చేస్తున్నానని తెలిపారు. ఫసల్ బీమా యోజన బలోపేతం చేశానని చెప్పారు. వ్యవసాయంలో అధిక ఉత్పత్తిని పెంచేందుకు కృషి చేస్తున్నామన్నారు. దేశంలో 80 శాతం మంది సన్నకారు రైతులు ఉన్నారని, పది కోట్ల మందిపైగా రెండు హెక్టార్ల భూమి కంటే తక్కువగా ఉందన్నారు. ఈ నెలలో జరిగే శీతాకాల సమావేశాల్లో చట్టాలను వెనక్కి తీసుకుంటామని స్పష్టం చేశారు. రైతులు ఆందోళన విరమించి ఇళ్లల్లోకి చేరుకోవాలని కోరారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా గత సంవత్సరం నుంచి రైతులు ఉద్యమం చేస్తున్న విషయం తెలిసిందే.
నూతన వ్యవసాయ చట్టాలు రద్దు చేస్తున్నాం: ప్రధాని
- Advertisement -
- Advertisement -
- Advertisement -