- Advertisement -
ఘాజీయాబాద్: నవంబర్ 26 నాటికి రైతుల చేస్తున్న ఆందోళనకు ఏడాది పూర్తికానుంది. కేంద్రం తెచ్చిన సేద్యపు చట్టాలకు వ్యతిరేకంగా గత ఏడాది నుంచి రైతులు ఆందోళన చేస్తున్నారు. వారు ఢిల్లీ బార్డర్ పోస్ట్ లయిన సింఘు, తిక్రీ, ఘాజీపూర్ బార్డర్లలో తమ నిరసన ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఇదిలావుండగా నవంబర్ 26 నాటికి కేంద్రం వివాదాస్పద సాగు చట్టాలను ఉపసంహరించుకోవాలని భారతీయ కిసాన్ యూనియన్(బికెయూ) నాయకుడు రాకేశ్ టికైత్ సోమవారం కేంద్రానికి తుది హెచ్చరిక చేశారు. ఒకవేళ అలా చేయకపోతే ఢిల్లీ చుట్టుపక్కల తమ ఆందోళనను మరింత తీవ్రతరం చేస్తానన్నారు.
- Advertisement -