Monday, December 23, 2024

చెక్ పోస్టుల వద్ద ముమ్మర తనిఖీలు

- Advertisement -
- Advertisement -
  • ఎస్పి గైక్వాడ్ వైభవ్ రఘునాథ్

నాగర్‌కర్నూల్: తెలంగాణలో 2023 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ సూచనల మేరకు నాగర్‌కర్నూల్ జిల్లాలో ఏర్పాటు చేసిన 1 ఇంటర్ స్టేట్ చెక్‌పోస్ట్, 5 ఇంటర్ డిస్ట్రిక్ట్ చెక్‌పోస్టుల వద్ద వచ్చే ప్రతి వాహనాలను 24/7 ముమ్మర తనిఖీ చేయడం జరుగుతుందని జిల్లా ఎస్పి గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ తెలిపారు. ఇందులో భాగంగా శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు నిర్వహించిన తనిఖీలలో 17 క్యాష్ సీజ్ కేసులు నమోదు చేసి 10 లక్షల 64 వేల 100 రూపాయలను సీజ్ చేయడం జరిగిందన్నారు. అదే విధంగా 11 లిక్కర్ కేసులు నమోదు చేసి 105.12 లీటర్ల మధ్యాన్ని సీజ్ చేయడం జరిగిందని, ఇందులో 57 లీటర్ల సారా, 48.12 లీటర్ల బీర్లు సీజ్ చేయడం జరిగిందని, సీజ్ అయిన లిక్కర్ విలువ దాదాపు 45 వేల 217 రూపాయలు ఉండవచ్చని తెలిపారు. అలాగే 14 కేసులు నమోదు చేసి 22 మందిని బైండోవర్ చేయడం జరిగిందని జిల్లా ఎస్పి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News