Sunday, December 22, 2024

10,028

- Advertisement -
- Advertisement -

వైద్య ఆరోగ్య శాఖలో కొలువుల జాతర

ప్రతి వారం విడతల వారీగా నోటిఫికేషన్లు

తొలుత ఎంబిబిఎస్ అర్హత
కలిగిన 1326 పోస్టులకు
ప్రకటన కరోనా కాలంలో
సేవలందించిన ఔట్ సోర్సింగ్
సిబ్బందికి భర్తీ ప్రక్రియలో 20%
వెయిటేజీ న్యాయపరమైన
చిక్కులు రాకుండా జాగ్రత్త
పడండి
సమీక్ష సమావేశంలో మంత్రి
హరీశ్‌రావు ఆదేశాలు ప్రైవేటు
ప్రాక్టీస్ రద్దు చేస్తూ ఆయుష్
సర్వీస్ నిబంధనల్లో మార్పులు

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర వైద్యారోగ్య శాఖ లో 10,028 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయాలని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీ శ్ రావు అధికారులను ఆదేశించారు. వారం వారం విడతల వారీగా నోటిఫికేషన్లు జారీ చేయాలని తెలిపారు. ముందుగా ఎంబిబిఎస్ అర్హత కలిగిన 1,326 పోస్టులకు నోటిఫికేషన్లు జారీ చేయాలని ఆదేశించారు. ఒకటి రెం డు రోజుల్లో వైద్యారోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి తొలి నోటిఫకేషన్ ఇవ్వాలని అన్నారు. వైద్యవిద్య, ప్రజారోగ్య విభాగం,తెలంగాణ వైద్యవిధాన పరిషత్, ఐపిఎం విభాగాల్లో మొత్తం 1,326 పోస్టులు మెడికల్ బోర్డు ద్వారా భర్తీ ప్రక్రియ చేపట్టాలని వెల్లడించారు. ఎస్‌సి,ఎస్‌టి, బిసి రిజర్వేషన్లు అనుసరించి ఎలాంటి న్యాయ వివాదాలు తలెత్తకుండా నోటిఫికేషన్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఉద్యోగాల నోటిఫికేషన్లపై మెడికల్ బోర్డు, ఆరోగ్య శాఖ, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో సోమవారం మంత్రి హరీశ్ రావు స మీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కరోనా కాలంలో సేవలందించిన ఔట్ సోర్సింగ్ సిబ్బందికి 20 శాతం వెయిటేజీ మార్కులు ఇవ్వాలని అన్నారు. ఆయుష్ విభాగంలోని పోస్టులను మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారానే భర్తీ చేయాలని మంత్రి ఆదేశించారు. టెక్నికల్ పోస్టులతో పాటు, ల్యాబ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ వంటి పోస్టులు టిఎస్‌పిఎస్‌సి ద్వారా భర్తీ చేయాలని, నిమ్స్‌లోని ఖాళీలను నిమ్స్ బోర్డు, మిగతా అన్ని పోస్టులను మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేయాలని తెలిపారు. అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్టులు, ట్యూటర్లు, సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, స్టాఫ్ నర్సులు, మల్టి పర్పస్ హెల్త్ అసిస్టెంట్లు వంటి పోస్టులన్నీ మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేయాలన్నారు.

ఆయుష్ విభాగంలోని స్టాఫ్ నర్సుల పోస్టులను టిఎస్‌పిఎస్‌సి ద్వారా కాకుండా, మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారానే భర్తీ చేయాలని మంత్రి ఆదేశించారు. ఇందుకు సంబంధించిన జీవో నెంబర్ 34, 35ను సవరించి నియామకాలు చేపట్టాలని పేర్కొన్నారు. స్టాఫ్ నర్సులకు మల్టిపుల్ ఛాయిస్ పద్ధతిలో రాత పరీక్ష నిర్వహించి మార్కుల ఆధారంగా ఎంపిక చేయాలని చెప్పారు. 80 శాతం రాత పరీక్షకు మార్కులు, 20 మార్కులు కొవిడ్ కాలంలో పని చేసిన వారికి వెయిటేజీ మార్కులు ఇవ్వాలని అన్నారు.

ప్రైవేట్ ప్రాక్టీస్‌ను రద్దు చేస్తూ సవరణలు

ఆయుష్ డాక్టర్లను టీచింగ్ స్టాఫ్‌గా మార్చే ప్రక్రియను త్వరగా పూర్తి చేసి, అందులో ఏర్పడే ఖాళీలను వచ్చే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలని మంత్రి ఆదేశించారు. ఆయుష్ సర్వీసు రూల్స్‌లో సవరణలు చేయాలని తెలిపారు. ప్రైవేట్ ప్రాక్టీస్‌ను రద్దు చేస్తూ సవరణలు చేయాలని మంత్రి హరీశ్ రావు వైద్యశాఖాధికారులను ఆదేశించారు. ఎన్‌హెచ్‌ఎంలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ద్వారా పని చేస్తున్న వారు ఎంత మంది ఉన్నారు..? ఏం పని చేస్తున్నారు..? అన్న అంశాలపై పూర్తి నివేదిక ఇవ్వాలని ఎన్‌హెచ్‌ఎం డైరెక్టర్ శ్వేతా మహంతిని మంత్రి హరీశ్ రావు ఆదేశించారు.

ఔట్ సోర్సింగ్ ద్వారా సేవలందిస్తున్న డాక్టర్లకు 20 శాతం వేయిటేజి

సీనియర్ రెసిడెంట్లు, హౌస్ సర్జన్లకు రూ.330 కోట్లు స్టైఫండ్‌గా ఇస్తున్నామని, వారి సేవలు సమర్థవంతంగా వినియోగంచుకునేలా విధి విధానాలు రూపకల్పన చేయాలని హరీశ్‌రావు పేర్కొన్నారు. ప్రస్తుతం ఇచ్చే నోటిఫికేషన్‌లో ట్యూటర్స్, సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు ఉన్నాయని వెల్లడించారు. ఎంబిబిఎస్ అర్హత గల ఈ పోస్టుల్లో ఔట్ సోర్సింగ్ ద్వారా సేవలందిస్తున్న వారికి 20 శాతం వేయిటేజి మార్కులు, మిగతా 80 శాతం మార్కులు వారు ఎంబిబిఎస్ డిగ్రీలో సాధించిన మార్కుల ఆదారంగా ఎంపిక చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. మొదటి విడతగా 1,326 పోస్టులకు నోటిటిఫికేషన్ జారీ చేయాలని, ఆ తర్వాత వెంటనే స్టాఫ్ నర్సులకు, ఇతర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం పరీక్షల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని, అందుకు అవసరమైన సాఫ్ట్‌వేర్ సిద్దం అయిందని వైద్య ఆరోగ్య శాఖ సెక్రటరీ రిజ్వీ తెలిపారు. మంత్రి హరీశ్ రావు ఆదేశాల మేరకు రెండు, మూడు వారాల్లో విడతల వారీగా నోటిఫికేషన్ల జారీ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ సమీక్షలో హెల్త్ సెక్రెటరీ రిజ్వీ, ఆర్థిక శాఖ కార్యదర్శి శివశంకర్, డిఎంఇ రమేష్ రెడ్డి, డీహెచ్ శ్రీనివాస్ రావు, టివివిపి కమిషనర్ అజయ్ కుమార్, కుటుంబ సంక్షేమ విభాగం డైరెక్టర్ శ్వేతా మహంతి, ఆయుష్ కమిషనర్ అలుగు వర్షిణి, మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ సెక్రెటరీ గోపీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.

12,755 పోస్టులు భర్తీ

రాష్ట్ర వైద్యారోగ్య శాఖలో మొత్తం 12,755 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఒక్క మెడికల్ బోర్డు (మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్) ద్వారానే 10,028 పోస్టుల భర్తీ ప్రక్రియ జరుగనుంది. ఈ క్రమంలో తొలిదశలో భాగంగా 1,326 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News