Wednesday, January 22, 2025

ఎన్‌పిడిసిఎల్‌లో 82 పోస్టుల భర్తీ

- Advertisement -
- Advertisement -

Replacement of 82 posts in NPDCL

 

మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ ఎన్‌పిడిసిఎల్ పరిధిలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. 82 అసిస్టెంట్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) పోస్టుల భర్తీకి ప్రక్రియకు సంబంధించి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానించారు. జూన్ 27 నుండి దరఖాస్తులను స్వీకరించనున్నారు. దరఖాస్తుల స్వీకరణకు ఆఖరు తేది జులై 11. ఆగష్టు 14న అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులకు ఉదయం 10.30 గం.ల నుండి 12.30 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్ష హాల్‌టికెట్లను ఆగష్టు 6వ తేదీ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. నార్థర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ కి సంబంధించిన 18 జిల్లా ల పరిధిలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. 18 నుండి 44 మధ్య వయస్సు కలిగి ఉండాలి. ఎస్‌సి, ఎస్‌టి, బిసి, ఇడబ్లుఎస్ అభ్యర్థులకు ఐదేళ్ల సడలింపు ఉంటుంది. దివ్యాంగులకు 10 ఏళ్ళ మినహాయింపు ఉంటుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News