Monday, December 23, 2024

ఇఎంఐలు మరింత భారం

- Advertisement -
- Advertisement -

రెపో రేటు 0.50% పెంపు

5.90 శాతానికి చేరిక మరింత ప్రియం
కానున్న గృహ, వాహన రుణాలు ద్రవ్యోల్బణం
కట్టడే లక్షం రేట్ల పెంపు కొనసాగుతోంది
ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత్ దాస్
న్యూఢిల్లీ : ఊహించినట్టుగానే ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) వరుసగా నాలుగోసారి రెపో రేటును అర శాతం పెంచింది. దీంతో రెపో రేటు 5.40 శాతం నుంచి 5.90 శాతానికి పెరిగింది. ఈ పెంపుతో గృహ, వాహన, వ్యక్తిగత రుణాల ఇఎంఐలు మరింత పెరుగుతాయి. ఇది వినియోగదారులపై తీవ్ర ప్రభావం చూపనుంది. ద్రవ్యోల్బణం కట్టడీయే లక్షంగా ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ మళ్లీ వడ్డీ రేట్లను పెంచారు. వచ్చే నెలల్లోనూ ఈ పెంపు ఉంటుందని సూచించారు. మూడు రోజుల ద్రవ్యపరపతి విధాన కమిటీ(ఎంపిసి) సమావేశం ఫలితాలను గవర్నర్ శుక్రవారం మీడియాకు వెల్లడించారు. ఎంపిసి కమిటీలో ఆరుగురు సభ్యులకు గాను ఐదుగురు రెపో రేటు పెంపునకు ఆమోదం తెలిపారు. మే నెల నుంచి ఇప్పటి వరకు వడ్డీ రేటు మొత్తంగా 1.90 శాతం పెరగ్గా, ప్రస్తుత రేట్లు మూడేళ్ల గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. ద్రవ్యోల్బణం పరంగా ఇప్పటికీ ఆందోళనకరంగానే ఉందని, మరోవైపు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల అనిశ్చితి కొనసాగుతోందని, ప్రపంచ వ్యాప్తంగా ఫైనాన్షియల్ మార్కెట్ల సెంటిమెంట్ ఆందోళకరంగా ఉందని గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. 202223 ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు అంచనా 7 శాతానికి కోత విధించారు. ఆగస్టులో ఈ అంచనా 7.2 శాతంగా ఉంది. అంటే 0.2 శాతం మేరకు తగ్గించారు. అలాగే ద్రవ్యోల్బణం అంచనా 6.7 శాతంగా ఉంది.

నాలుగు సార్లు 1.90% పెరిగింది

ప్రతి రెండు నెలలకు ఒకసారి ద్రవ్య విధాన సమావేశం జరుగుతుంది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి సమావేశం ఏప్రిల్‌లో జరిగింది. అప్పుడు ఆర్‌బిఐ రెపో రేటును 4 శాతం వద్ద స్థిరంగా ఉంచింది. ఆ తర్వాత మే 2, 3 తేదీల్లో ఆర్‌బిఐ అత్యవసర సమావేశాన్ని నిర్వహించి రెపో రేటును 0.40 పెంచడంతో మొత్తం రేటు 4.40 శాతానికి చేరింది. దీని తర్వాత జూన్ సమావేశంలో రెపో రేటును 0.50% పెంచారు. దీంతో రెపో రేటు 4.40% నుంచి 4.90%కి పెరిగింది. ఆ తర్వాత ఆగస్టులో 0.50% పెంచడంతో మొత్తం 5.40 శాతానికి చేరింది. ఇప్పుడు వడ్డీ రేటు 5.90 శాతానికి పెరిగింది.

గృహ  రుణం మరింత ఖరీదు

రెపో రేటు పెంపుతో గృహ రుణం ఖరీదవుతాయని రియాల్టీ కంపెనీలు పేర్కొంటున్నాయి. ఇది ఇంటి కొనుగోలు శక్తిపై ప్రభావం చూపుతుంది. రెపో రేటు పెంపు తర్వాత గృహ రుణాలు ఖరీదైనవిగా మారనున్నాయని ప్రాపర్టీ కన్సల్టెన్సీ కంపెనీ అనరాక్ చైర్మన్ అనూజ్ పూరి తెలిపారు. ఇది సరసమైన, మధ్య-శ్రేణి గృహాల అమ్మకాలను కొంతవరకు ప్రభావితం చేయవచ్చు. గృహ రుణాలపై వడ్డీ రేటు పెరిగినా, ఇళ్ల ధరలు పెరిగినా జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో ఇళ్ల విక్రయాలు 40 నుంచి 50 శాతం పెరిగాయి. ఆర్‌బిఐ రెపో రేటును పెంచడం ఆర్థిక వ్యవస్థపై విశ్వాసాన్ని, భవిష్యత్తు వృద్ధిని ప్రతిబింబిస్తుందని రియల్ ఎస్టేట్ కంపెనీల అపెక్స్ బాడీ అయిన క్రెడాయ్ పేర్కొంది. ప్రపంచంలోని అనేక దేశాలలో విధాన రేట్లను దూకుడుగా పెంచడం వల్ల ఇది తప్పనిసరి అయింది. రియల్ ఎస్టేట్ రంగంపై దీని ప్రభావం స్వల్పంగానే ఉంటుందని సంస్థ వెల్లడించింది.

హోమ్ లోన్ వడ్డీ రేట్లు పెరుగుతాయా?

ఫిక్స్‌డ్, రెండో ఫ్లెక్సిబుల్ అనే రెండు రకాలు ఉన్నాయి. ఫిక్స్‌డ్‌లో లోన్ వడ్డీ రేటు మొదటి నుండి చివరి వరకు ఒకే విధంగా ఉంటుంది. దీంతో రెపో రేటులో ఎలాంటి మార్పు చేసినా స్థిరంగా ఉంటాయి. మరోవైపు ఫ్లెక్సిబుల్ వడ్డీ రేటును తీసుకున్నప్పుడు రెపో రేటులో మార్పు మీ లోన్ వడ్డీ రేటుపై ప్రభావం చూపుతుంది. ఫ్లెక్సిబుల్ వడ్డీ రేటుతో రుణం తీసుకున్నట్లయితే మీ లోన్ ఇఎంఐ కూడా పెరుగుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News