అటవీ భూమి విషయంలో 1996 డిసెంబర్‌లో టిఎన్ గోదావర్మన్ తిరుముల్పాడ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు మైలురాయి. తీర్పు అటవీ భూమికి సంబంధించి నిఘంటువు అర్థాన్ని పునర్నిర్వచించినప్పటికీ, తర్వాత అధికారం లోకి వచ్చిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యంగా కేంద్రం, రాష్ట్రంలోని బిజెపి ప్రభుత్వాలు సుప్రీం కోర్టు ఆదేశాలను నీర్చుగార్చడానికి ప్రయత్ని స్తున్నాయి. అటవీ నిర్మూలన లో అసోం అగ్రస్థానంలో ఉంది. 2023 ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ ప్రకారం అసోంలో ప్రస్తుతం అటవీ విస్తీర్ణం 19,699.73 చదరపు కిలోమీటర్లుగా ఉంది. కానీ 2021-2023 మధ్య 86.66 చదరపు కిలోమీటర్ల అడవి అంతరించిపోయింది.
అసోంలోని 2,13,253.91 హెక్టార్ల అటవీ భూమి ఆక్రమణకు గురైందని నివేదిక వెల్లడించింది. భారత దేశంలో అత్యధికంగా, మహారాష్ట్రలో 57,554.87 హెక్టార్లు, అరుణాచల్‌ప్రదేశ్‌లో 53,499.96 హెక్టార్ల అటవీ భూమి ఆక్రమణకు గురైంది. ఇదిలా ఉండగా, లక్షద్వీప్, పుదుచ్చేరిలో ఆక్రమణకు గురైన భూమి సున్నా హెక్టార్లు. జస్టిస్ ప్రకాశ్ శ్రీవాస్తవ ఆధ్వర్యంలోని ధర్మాసనం, నిపుణుడు అఫ్రోజ్ అహ్మద్ అసోం అటవీ సంరక్షణ, పరిరక్షణ చట్టాలను ఉల్లంఘించిందని పేర్కొన్నారు. ఇది ఈశాన్య ప్రాంతం అంతటా వాతావరణ మార్పు ప్రభావాలను మరింత తీవ్రతరం చేసింది.
మూడు కీలక రిజర్వు ఫారెస్ట్‌ల ఆక్రమణల వివరాలను సమర్పించ వలసిందిగా కోరినా అటవీ శాఖ, పర్యావరణ పరిరక్షణ, పర్యావరణ మార్పుల మంత్రిత్వశాఖ, అసోం ప్రభుత్వం నివేదిక సమర్పించడంలో వైఫల్యం చెందడం పట్ల నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. చార్దువార్ రిజర్వ్ ఫారెస్ట్, బలిపార రిజర్వ్ ఫారెస్ట్, సోనై రూపాయ్ వన్యప్రాణుల అభయారణ్యంతో కూడిన మూడు అడవుల భూమి ఆక్రమణ అంశం ఒక సంవత్సరంగా దర్యాప్తులో ఉంది. 2024 ఆగస్టులో ఈ వివాదంపై నివేదిక సమర్పించవలసిందిగా అటవీ, పర్యావరణ పరిరక్షణ, పర్యావరణ మార్పుల మంత్రిత్వశాఖ, అసోం చీఫ్ సెక్రటరీ జాతీయ గ్రీన్ ట్రిబ్యూనల్ ఆదేశాలను పట్టించుకోలేదు.
ఈ విషయంలో మీడియాలో వచ్చిన కథనాల ప్రాతిపదికగా 2004 జనవరిలో సుమోటోగా కేసు నమోదు చేసి, 44 హెక్టార్ల అటవీ రక్షణ జోన్ భూమిని పోలీసు కమాండో బెటాలియన్‌కు కేటాయించి అంశంపై వివరణ ఇవ్వాల్సిందిగా అసోం మంత్రిత్వశాఖ, హైలకండి జిల్లా మెజిస్ట్రేట్, అటవీ శాఖ, పర్యావరణ పరిరక్షణ మార్పు మంత్రిత్వ శాఖలకు నోటీసులు జారీ చేసింది.ఇదే సమయంలో గౌహతి సమీపంలోని గర్భాంగా వన్యప్రాణుల పరిరక్షణ కేంద్రానికి సంబంధించిన ప్రాధమిక నోటిఫికేషన్‌ను ఏమాత్రం చట్టపరమైన ప్రక్రియ ను అనుసరించకుండానే రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం పట్ల పర్యావరణ కార్యకర్తలు తీవ్రంగా విమర్శించారు. అసోం పర్యావరణ, అటవీశాఖ వెబ్ సైట్ ప్రకారం, ప్రభుత్వం 2022 మార్చి 28న రాణి, గర్భాంగా రిజర్వు అడవులలో దాదాపు 73 చదరపు మైళ్లను గర్భాంగా వన్యప్రాణుల అభయారణ్యంగా పేర్కొంటూ ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది.
అటవీ చట్టం ప్రకారం నోటిఫికేషన్ జారీ చేయబడిన తర్వాత, ఆ జోన్ రక్షిత ప్రాంతం హోదాను పొందుతుందని గమనించాలి.
ప్రభుత్వం ఏదైనా అటవీ భూమి హోదాను మార్చాలన్నా జాతీయ వన్యప్రాణుల బోర్డు, సుప్రీం కోర్టు ఆమోదం పొందవలసి ఉంటుంది. ఆ తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. అత్యధికంగా ఖడ్గ మృగాలు, అరుదైన అంతరించిపోతున్న పక్షులకు నెలవైన పొబిటియోరా వన్యప్రాణుల అభయారణ్యంను డీ నోటిఫై చేయాలని అంతకుముందు అసోం ప్రభుత్వం నిర్ణయించింది. తప్పనిసరిగా పాటించవల సిన ప్రక్రియను చేపట్టకుండానే, పొబిటి యోరా వన్యప్రాణుల అభయారణ్యాన్ని డీ నోటిఫై చేయాలన్న అసోం ప్రభుత్వం నిర్ణయాన్ని సుప్రీం కోర్టు తీవ్రంగా విమర్శించింది.
డీనోటిఫికేషన్ వల్ల అసోంలో వన్యప్రాణులు తీవ్రంగా నష్టపోయాయి. ఏనుగులు ఆహారం కోసం గ్రామాలలోకి, జనారణ్యంలోకి ప్రవేశించాయి. ఈ విధంగా ఏనుగులు గ్రామాలలో ప్రవేశించడం వల్ల జరిగిన ఘర్షణల్లో 2019 -2020, 2023 -24 మధ్య 383 మంది మనుషులు, 91 ఏనుగులు చనిపోయాయని అధికార నివేదికలు చెబుతున్నాయి. ఇదే ధోరణి కొనసాగితే అసోంలో తీవ్రంగా జీవవైవిధ్యం నష్టమవుతుందని, పర్యావరణలో అస్థిరత ఏర్పడుతుందని, మనుషులకు వన్యప్రాణులకు మధ్య ఘర్షణలు మరీ పెచ్చుపెరుగుతాయని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు.
అటవీ కొండలలో గ్రానేట్ మైనింగ్ హతీ ఉల్తా పహార్ అం ఏనుగులు ఎక్కే గొండ అని అర్థం. అసోంలోని మోరిగావ్ జిల్లాలోని మయోంగ్ ప్రాంతంలోని ప్రజలు కొండను గ్రానైట్ తవ్వకాల కోసం లీజుకు ఇవ్వాలన్న రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రప్రభుత్వం హాతీ ఉఠా పహార్ కొండ ప్రాంతంలో గ్రానైట్ తవ్వకాల కోసం బిడ్లను ఆహ్వానించడంలో చూపిన తొందరపాటు, స్థానిక ప్రజల అభిప్రాయాలను తీసుకోకపోవడం, గ్రామస్థులను విశ్వాసంలోకి తీసుకోకుండా పర్యావరణానికి హాని కలిగించే ఈ ప్రాజెక్టును రహస్యంగా అమలు చేయడానికి యత్నిస్తున్న తీరు తీవ్రంగా కలవరం కలిగిస్తూ, పలు ప్రశ్నలను లేవనెత్తుతోంది. ప్రపంచంలో అడవులకు సంబంధించి పర్యవేక్షించే ఓపెన్ సోర్స్ వెబ్ గ్లోబల్ ఫారెస్ట్ వాచ్ సమర్పించిన నివేదిక, ఈశాన్య భారతంలో 2001- 23 సంవత్సరాల మధ్య నష్టమైన అడవులు వివరాలు దగ్గరగా ఉన్నాయి. దేశంలో దాదాపు 75 శాతం చెట్లు ఈ కాలంలో ధ్వంసమైపోయాయి. ఈ ప్రాంతంలోని అన్ని రాష్ట్రాల కన్నా ఎక్కువగా అసోంలోనే చాలా చెట్లు నాశనమైపోయాయి.
ల్యాండ్ మార్క్ తీర్పు
1996 డిసెంబర్‌లో టిఎన్ గోదావర్మన్ తిరుముల్పాడ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన మైలురాయి వంటి తీర్పును 2025 మార్చి 4న మరో సారి సుప్రీం కోర్టు సమర్థించింది. అడవులను పునర్నిర్వచించి, దాని విస్తృతిని అన్నింటినీ నిఘంటువు అర్థం ద్వారా అర్థం చేసుకోవాలని మరో మారు తీర్పు నిచ్చింది. రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, కేంద్ర పాలిత ప్రాంతాల నిర్వాహకులు తమ అధికార పరిధిలోని అడవులను గుర్తించడానికి ఒక నెలలోపు నిపుణుల కమిటీలను ఏర్పాటు చేయడంలో విఫలమైతే, అటవీ ప్రాంతాలు, వర్గీకరించని, కమ్యూనిటీ అటవీ భూములతో సహా భూముల ఏకీకృత రికార్డును తయారు చేయడంలో విఫలమైతే వారు వ్యక్తిగతంగా బాధ్యత వహించాల్సి ఉంటుందని సుప్రీం కోర్టు మార్చి 4న తీవ్ర హెచ్చరిక జారీ చేసింది.
తదుపరి ఆదేశాలు వచ్చే వరకు అటవీ ప్రాంతాల తగ్గింపుకు దారితీసే ఎటువంటి చర్యలు తీసుకోవద్దని సుప్రీం కోర్టు గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. 2023 అటవీ సంరక్షణ చట్టానికి సవరణలను సవాలుచేస్తూ దాఖలైన పిటిషన్లను విచారిస్తూ న్యాయమూర్తులు బిఆర్ గవాయ్, కె వినోద్ చంద్రన్ లతో కూడిన ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. 2025 ఫిబ్రవరి 3న మధ్యంతర ఉత్తర్వు జారీ అయింది. అటవీ విస్తీర్ణం తగ్గడానికి దారితీసే ఏ చర్యను తాము అనుమతించబోమని, పరిహారంగా భూమిని అందించకుండా, తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు, భారత యూనియన్ లేదా ఏ రాష్ట్రం అటవీ భూమిని తగ్గించే ఎటువంటి చర్యలు తీసుకోరాదని ధర్మాసనం పేర్కొంది.
2023లో మోడీ ప్రభుత్వం అటవీ చట్టానికి సవరణ చేయడం ద్వారా ప్రవేశపెట్టిన అత్యంత హానికరమైన నిబంధనలలో ఒకదాన్ని సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. ఇది 1980 అక్టోబర్ 25న లేదా ఆ తర్వాత ప్రభుత్వ రికార్డుల లో అడవులుగా నమోదు చేసిన నోటిఫైడ్ అడవులుకు, అటవీ ప్రాంతాలకు అడవి నిర్వచనాన్ని పరిమితం చేసింది. ఈ సవరణలు అడవి నిర్వచనాన్ని కుదించాయని, అటవీయేతర వినియోగానికి 1.99 లక్షల చదరపు కిలోమీటర్ల భూమిని అందుబాటులోకి తెస్తాయని పిటిషనర్లు వాదిస్తున్నారు. ఈ మార్పులపై, ముఖ్యంగా విస్తారమైన అటవీ ప్రాంతాలను చట్టపరమైన రక్షణ నుండి మినహాయించడంపై కోర్టు గతంలో ఆందోళన వ్యక్తం చేసింది. 2023లోని వన సంరక్షణ సంవర్థన్ నియమాలలోని 16(1) ప్రకారం అటవీ భూముల రికార్డుల ఏకీకరణ ప్రక్రియను పూర్తి చేయలేదని కేంద్రం న్యాయాధికారి తెలిపారు.
నిపుణుల కమిటీలు గుర్తించిన అడవులవంటి ప్రాంతాలు, కమ్యూనిటీ అటవీభూముల పరిరక్షణ చట్టం పరిధిలోకి తీసుకువస్తుంది. 1996 తీర్పులో నిఘంటువు అర్థంలో అడవులను చేర్చడంతో పాటు, 1980 నాటి అసలు అటవీ చట్టంలోని సెక్షన్ 2 లోని ‘అడవి’ అనే పదం కింద గుర్తింపు పొందిన అన్ని అడవులకు రిజర్వు, రక్షిత అడవులకు వర్తిస్తాయని పేర్కొంది.1996 ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు నవంబర్ 2023, ఫిబ్రవరి 2024, ఫిబ్రవరి 3, 2025, మార్చి 4, 2025 నాడు ఇచ్చిన మూడు తదుపరి ఆదేశాల ద్వారా బలోపేతం చేసింది. 16(1) నిబంధన ప్రకారం నిపుణుల కమిటీలను ఏర్పాటు చేసి, వారి అటవీ భూముల ఏకీకృత రికార్డులను సమర్పించాలనే 1996 తీర్పు నెరవేర్చడానికి, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు సమర్పించే నివేదికల కోసం కోర్టు నెలల తరబడి వేచి ఉంది. ప్రతి రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతంలోని నిపుణుల కమిటీలు అడవులను గుర్తించాలి.
వీటిలో గతంలో నరికివేసిన అడవులకు గుర్తింపు ఉంటుంది, అలాగే ప్రైవేటు వ్యక్తులకు చెందిన తోటప్రాంతాలను కూడా కవర్ చేస్తుంది. సుప్రీం కోర్టు ఆదేశాలను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు చిత్తశుద్ధి తో అమలు చేసి వచ్చే ఆరు నెలలలోగా కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని మార్చి 4న సుప్రీం కోర్టు ఆదేశించింది. అటవీ పెంపకం కోసం రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం పరిహారంగా ప్రత్యామ్నాయ భూమిని అందించకపోతే, కేంద్రం లేదా, రాష్ట్రం అటవీ భూమిని తగ్గించడానికి ఎటువంటి చర్యలు తీసుకోకూడదనిసుప్రీం కోర్టు ఆదేశించింది. అత్యున్నత న్యాయస్థానం ఆదేశం వల్ల అటవీ భూమిని లీనియర్ ప్రాజెక్టులకు కేటాయిస్తే, పరిహారంగా మరిన్ని అడవులను పెంచేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేలా, సుప్రీం కోర్టును ఆశ్రయించడానికి వెసులుబాటు కల్పించవచ్చు. 1996లో సుప్రీం కోర్టు గోదావర్మన్ కేసులో ఇచ్చిన తీర్పు స్ఫూర్తితో ఈ ఆందోళనలను పరిష్కరించాలి.
– గీతార్థ పాఠక్