Sunday, January 19, 2025

అనేక లోపాలకు తోడు సిగ్నల్ తప్పిదం వల్లే ఘోరం..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఒడిషాలో గత నెలలో జరిగిన ఘోరమైన కోరమాండల్ రైలు దుర్ఘటనకు తప్పుడు సిగ్నలింగ్ కారణం అని విచారణ కమిటీ వెల్లడించింది. 300 మంది వరకూ ప్రాణాలు పోయిన ఈ ఘటన గురించి రైల్వే సేఫ్టీ కమిషన్ దర్యాప్తు నివేదికను రైల్వేబోర్డుకు అందించింది. ఇందులో పలు విషయాలు వెల్లడించింది. రాంగ్ సిగ్నలింగ్ ప్రధాన కారణం. దీనితో పాటు పలు ఇతర అనేక తప్పిదాలు బాలాసోర్ రైలు ప్రమాదానికి దారితీశాయని పేర్కొన్నారు. సిగ్నలింగ్ , టెలికమ్యూనికేషన్ విభాగం (ఎస్ అండ్‌టి)లో పలు స్థాయిలో తప్పిదాలు మానవ ప్రాణాలు పోవడానికి దారితీసిందని తెలిపారు. ఇంతకు ముందు ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు దర్యాప్తులు జరిగాయి. ఈ క్రమంలో ఇచ్చిన నివేదికల్లో తీసుకోవల్సిన చర్యలు, దిద్దుబాట్ల గురించి పేర్కొన్నారు. వీటిని పాటించి ఉంటే, నివారణ చర్యలకు దిగి ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండకపోయేదని స్పష్టం చేశారు.

రైల్వే సేఫ్టీ కమిషన్ (సిఆర్‌ఎస్) తను స్వతంత్రంగా నిర్వహించిన దర్యాప్తు క్రమంలో వెలుగులోకి వచ్చిన విషయాలను నివేదిక రూపంలో బోర్డుకు అందించింది. సిగ్నలింగ్ వ్యవస్థను చక్కదిద్ది ఉండాల్సింది. సిగ్నలింగ్ పద్దతులలో మానవ, యాంత్రిక ప్రమేయాలు ఉంటాయి. సమన్వయం తప్పితే ఇటువంటి ఘోర ప్రమాదాలే చోటుచేసుకుంటాయని ఈ ఘటన తేల్చిందని వివరించారు. రెండు సమాంతర ట్రాక్‌ల సంబంధిత సిగ్నల్స్ స్విచ్చ్‌లు రైళ్లు వేళ్లే దశలో అసాధారణ రీతిలో పనిచేయడం గురించి ముందుగానే బహానాగా బజార్ స్టేషన్ మేనేజర్‌కు తెలియచేశారని, అయితే దీనిపై స్పందించిన దాఖలాలు కనబడటం లేదని నివేదికలో తేల్చారు. పలు సాంకేతిక తప్పిదాలు జరిగాయి. స్టేషన్ సంబంధిత ఆమోదిత సర్కూట్ డయాగ్రామ్ సంబంధిత పనులలో లోపాలు కూడా ముప్పు తెచ్చిపెట్టాయి.

లెవల్ క్రాసింగ్ గేటు 94వద్ద బారియర్‌ల ఎత్తివేతను ఎలక్ట్రిక్ లిఫ్టింగ్ ద్వారా చేపట్టారు. దీనితో తలెత్తిన తప్పిదం నష్టాన్ని తెచ్చిపెట్టిందని నివేదికలో తెలిపారు. 2022 మే 16న ఇటువంటి ప్రమాదమే సౌత్ ఈస్టర్న్ రైల్వేలోని ఖరగ్‌పూర్ డివిజన్‌లో ఉన్న బంకారనాయాబాజ్ స్టేషన్‌లో జరిగిన ప్రమాదానికి రాంగ్ వైరింగ్, కేబుల్ లోపాలే కారణం అని నివేదికలు తేల్చాయని అయితే దిద్దుబాటు చర్యలు తీసుకుని ఉంటే, సిగ్నల్ వ్యవస్థను చక్కదిద్ది ఉంటే ఇప్పుడు ఈ ఘటన జరిగి ఉండకపొయ్యేదని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News