Thursday, January 9, 2025

డిఎస్పీ అత్యుత్సాహం వల్లే తొక్కిసలాట ఘటన.. సిఎం చంద్రబాబుకు నివేదిక

- Advertisement -
- Advertisement -

తిరుమలలో తొక్కిసలాట ఘటనపై ముేఖ్యమంత్రి చంద్రబాబుకు అధికారులు నివేదిక అందజేసినట్లు తెలుస్తోంది. డీఎస్పీ అత్యుత్సాహం వల్ల ఒక్కసారిగా భక్తులు రావడంతో తొక్కిసలాట జరిగిందని.. ఘటనపై డీఎస్పీ సరిగా స్పందించలేదని నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. “ఎస్పీ వెంటనే సిబ్బందితో వచ్చి భక్తులకు సాయం చేశారు. అంబులెన్స్‌ వాహనాన్ని టికెట్‌ కౌంటర్‌ బయట పార్క్‌ చేసి డ్రైవర్‌ వెళ్లిపోయాడు. 20 నిమిషాల పాటు డ్రైవర్‌ అందుబాటులోకి రాలేదు. డీఎస్పీ, అంబులెన్స్‌ డ్రైవర్‌ నిర్లక్ష్యం వల్లే భక్తులు చనిపోయారు” అని నివేదికలో వెల్లడించినట్లు తెలుస్తోంది. ఈ ఘటన జరిగిన తర్వాత డీఎస్పీ తీరుపై ఎస్పీ సుబ్బారాయుడుకు కలెక్టర్‌ ఫిర్యాదు చేశారు.

నిన్న వైకుంఠద్వార దర్శనం టోకెన్ల జారీలో తొక్కిసలాట జరిగి ఆరుగురు భక్తులు మృతి చెందారు.ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సిఎం చంద్రబాబు.. డీజీపీ, టీటీడీ ఈవో, తిరుపతి కలెక్టర్, ఎస్పీలతో టెలీకాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ఘటనకు కారణాలు, ప్రస్తుత పరిస్థితిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వైకుంఠద్వార దర్శనం టోకెన్ల కోసం వచ్చే భక్తులకు తగిన ఏర్పాట్లు ఎందుకు చేయలేదని అధికారులపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News