Sunday, December 22, 2024

సాయుధ బలగాల్లో మహిళా ప్రాతినిధ్యం పెంచుతాం: ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

ముంబై : సాయుధ బలగాల్లో మహిళల ప్రాతినిధ్యం పెంచుతామని, భారత సంస్కృతికి తగ్గట్టు నౌకాదళంలో ర్యాంకుల పేర్లు మార్చుతున్నామని ప్రధాని నరేంద్రమోడీ వెల్లడించారు. నౌకాదళ దినోత్సవం సందర్భంగా మహారాష్ట్ర లోని సింధుదుర్గ్‌లో ఏర్పాటైన కార్యక్రమంలో మోడీ పాల్గొన్నారు.

పోర్టు ఆధారిత అభివృద్ధికి భారత్ బారీ మద్దతు ఇస్తోందన్నారు. మర్చెంట్ షిప్పింగ్‌ను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. ఈ నేపథ్యంలో సముద్రాల వనరులను విస్తృతంగా వినియోగించుకునేలా ముందుకు సాగుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముందు రాజ్‌కోట్ కోటలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని మోడీ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న దేశ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడాన్ని ఘనంగా పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News