Monday, January 20, 2025

తెలంగాణ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించిన ఇంటర్నేషనల్ హాస్పిటల్స్ గ్రూప్

- Advertisement -
- Advertisement -

Representatives of International Hospitals Group praised TS govt

రాష్ట్రంలో నిర్మిస్తున్న ఆసుపత్రులకు
సాంకేతిక సహకారం అందిస్తామని వెల్లడి
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, ఏర్పాటవుతున్న
ఆసుపత్రుల గురించి బ్రిటిష్ హై కమిషనర్,
ఐహెచ్‌జి ప్రతినిధులను వివరించిన మంత్రి హరీశ్‌రావు

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో పెద్ద మొత్తంలో మెడికల్ కాలేజీలు, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మిస్తున్న నేపథ్యంలో ఇంటర్నేషనల్ హాస్పిటల్స్ గ్రూప్ ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. సాంకేతిక సహకారం అందించేందుకు సిద్ధమని సంసిద్ధత వ్యక్తం చేశారు. యుకెకు చెందిన ఇంటర్నేషనల్ హాస్పిటల్స్ గ్రూప్ ప్రపంచ వ్యాప్తంగా హెల్త్ కేర్ సర్వీస్ అందిస్తున్నది. 55 దేశాల్లో 480 హెల్త్ కేర్ ప్రాజెక్ట్‌లు పూర్తి చేసింది. బుధవారం రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావుతో బ్రిటిష్ హై కమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్, ఇంటర్నేషనల్ హస్పిటల్స్ గ్రూప్ సిఇఒ చేస్టర్ కింగ్, సిఒఒ సైమన్ ఆశ్వర్త్, భారత ప్రతినిధి పృథ్వి సహాని, ఇతర ప్రతినిధులు భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా బ్రిటిష్ హై కమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ మాట్లాడుతూ.. తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకుపోతున్నదని వ్యాఖ్యానించారు. ఇక్కడి ప్రభుత్వం కృషి వల్ల హైదరాబాద్ అభివృద్దికి మారుపేరుగా నిలిచిందని అన్నారు. ప్రపంచస్థాయి కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నాయని, ఈ క్రమంలో ఐహెచ్‌జి ఆసక్తి చూపిస్తున్నదని తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని, తెలంగాణలో ఏర్పాటు చేస్తున్న టిమ్స్, మెడికల్ కాలేజీలు, వరంగల్ మల్టీ సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి తదితర అంశాల గురించి మంత్రి హరీశ్‌రావు వారికి వివరించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సెక్రెటరీ రిజ్వీ, సిఎం ఒఎస్‌డి గంగాధర్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ విభాగం కమిషనర్ శ్వేత మహంతి, డీహెచ్ శ్రీనివాసరావు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News