హైదరాబాద్: తెలంగాణలో జెడ్పిటిసి, ఎంపిటిసి, ఎంపిపి, గ్రామ సర్పంచుల గౌరవ వేతనాలు పెంచుతూ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఉత్తర్వులు జారీ చేయడంతో మేడ్చల్ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఆయనకు కృతఙ్ఞతలు తెలిపారు. బుధవారం మంత్రి మల్లారెడ్డి ఆధ్వర్యంలో సిఎం కెసిఆర్ చిత్రపటానికి మేడ్చల్ జిల్లా స్థానిక ప్రజాప్రతినిధులు పాలాభిషేకం చేశారు. మేడ్చల్ నియోజకవర్గంలోని మేడ్చల్, మూడుచింతల పల్లి, ఘట్కేసర్, శామీర్పేట్, కీసర మండలాల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో జడ్పి చైర్మన్ శరత్ చంద్ర రెడ్డి, ఎంపిపిలు, ఎంపిటిసిలు, జెడ్పిటిసిలు, సర్పంచ్ లు, తదితర పార్టీ నేతలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీసుకున్న ఈ నిర్ణయం ఒక గొప్ప నిర్ణయమని, దీని వల్ల గ్రామస్థాయిలో పని చేస్తున్న ప్రజాప్రతినిధులు మరింత శ్రద్ధతో పని చేస్తారని మంత్రి మల్లారెడ్డి కొనియాడారు. ఇప్పటికే ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లడంతో గ్రామస్థాయి ప్రతినిధులు చాలా అద్భుతంగా పని చేస్తున్నారన్నారు. తెలంగాణ ప్రభుత్వం వారికి తగినంత ప్రాదాన్యత ఇస్తూ న్యాయం చేస్తోందని, కొత్తగా పెంచిన గౌరవ వేతనాలు దీనికి నిదర్శనమన్నారు. సిఎం కెసిఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఆదర్శంగా రూపుదిద్దుకుంటుందని మల్లారెడ్డి ప్రశంసించారు.
గౌరవ వేతనాలు పెంచినందుకు కృతఙ్ఞతలు…
- Advertisement -
- Advertisement -
- Advertisement -