Monday, December 23, 2024

ఆధ్యాత్మిక సమ్మేళనానికి ఆహ్వానం

- Advertisement -
- Advertisement -

గ్రామీణ అభివృద్ధి, వ్యవసాయ రంగంతో పాటు పలు సామాజిక రంగాల్లో సేవలందిస్తున్న ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక సంస్థ రామచంద్ర మిషన్ ప్రతినిధులు ఆదివారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. హైదరాబాద్‌లో త్వరలో తాము నిర్వహించనున్న ఆధ్యాత్మిక సమ్మేళనానికి హాజరు కావాల్సిందిగా మిషన్ ప్రస్తుత ఆధ్యాత్మిక గురువు కమలేష్ పటేల్ ఈ సందర్భంగా సిఎం కెసిఆర్‌ను ఆహ్వానించారు. మిషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సామాజిక సేవా ఆధ్యాత్మిక కార్యక్రమాలను సిఎంకు వారు వివరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు పలువురు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News