Monday, December 23, 2024

ముఖ్యమంత్రితో ఆరు ఫార్మా కంపెనీల ప్రతినిధుల భేటీ!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం తాజాగా పలు ఫార్మా కంపెనీలతో పరస్పర అవగాహన ఒప్పందం(ఎంఓయూ) కుదుర్చుకుంది. దీంతో తెలంగాణ రాష్ట్రానికి రూ. 5260 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. వీటి ద్వారా ఫార్మా రంగంలో 12490 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి.

ఎంఎస్ఎన్ గ్రూప్, లారస్ ల్యాబ్స్, గ్లాండ్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ లాబోరేటరీస్, అరబిందో ఫార్మా, హెటిరో ల్యాబ్స్ కంపెనీల ప్రతినిధులు నేడు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో సంప్రదింపులు జరిపారు.టిఎస్ఐఐసి చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, సిఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్న ఈ సమావేశంలో ఎంవోయూ కుదుర్చుకున్నాయి. ఈ సమవేశంలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ డైరెక్టర్ సతీశ్ రెడ్డి, లారస్ ల్యాబ్స్ ఈడి వివి. రవికుమార్, గ్లాండ్ ఫార్మా సిఈవో శ్రీనివాస్, ఎంఎస్ ల్యాబ్స్ సిఎండి ఎం.ఎస్.ఎన్. రెడ్డి, అరబిందో డైరెక్టర్ మదన్ మోహన్ రెడ్డి, హెటిరో గ్రూప్ ఎండి వంశీ కృష్ణ పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News