Thursday, January 23, 2025

ముఖ్యమంత్రి కెసిఆర్‌ను కలిసిన టిజిఓ, టిఎన్జీఓ ప్రతినిధులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : అసెంబ్లీలో ముఖ్యమంత్రి కెసిఆర్‌ను టిఎన్జీఓలు, టిజిఓల ప్రతినిధులు గురువారం కలిశారు. ఉద్యోగుల వేతన సవరణ, ఆరోగ్య పథకంపై చర్చించారు. వేతన సవరణ కమిషన్‌తో పాటు మధ్యంతర భృతికి సంబంధించి వారు సిఎం కెసిఆర్‌కు వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ అంశంపై త్వరలో నిర్ణయం ప్రకటిస్తామని సిఎం వారికి హామీ ఇచ్చారు. ఆరోగ్య పథకం అమలు చేస్తామని, అలాగే ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న బిటిఎన్జీవోస్ హౌసింగ్ సొసైటీ భూమి కేటాయింపు ఉత్తర్వులు జారీ చేయాలని సంబంధిత అధికారులకు కెసిఆర్ ఆదేశాలు జారీ చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News