Monday, December 23, 2024

జీబ్రా చేపలో రెటీనా ప్రత్యుత్పత్తి సామర్ధ్యం

- Advertisement -
- Advertisement -

క్షీరదాలకు పూర్తి భిన్నంగా జీబ్రాచేప తన కంటి లోని రెటీనా గాయపడితే తిరిగి రెటీనాను ప్రత్యుత్పత్తి చేసుకుని దృష్టిని పొంద గలుగుతుంది. ఇటువంటి అద్భుత ప్రక్రియ వెనుకనున్న సంకేతాలను, జన్యువుల గుట్టును తెలుసుకోడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. ఆ విధమైన ప్రక్రియ మనుషుల్లో ఎందుకు జరగడం లేదో అని సంశయం వారికి కలుగుతోంది. జీబ్రా చేపలో ప్రత్యేకమైన సంకేత వ్యవస్థ సోనిక్ హెడ్జెహాగ్ (ఎస్ హెచ్ హెచ్) కండరాలను ప్రత్యుత్పత్తి చేయడానికి దోహదం చేస్తుందని ఇదివరకే పరిశోధనల్లో వెల్లడైంది. రెటీనా ప్రత్యుత్పత్తిపై సోనిక్ హెడ్జెహాగ్ సంకేత వ్యవస్థ ప్రభావాన్ని అర్థం చేసుకోడానికి ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చి (ఐఐఎస్‌ఇఆర్) మొహాలి పరిశోధకులు ప్రయత్నంలో భాగంగా ఈ ఎస్‌హెచ్‌హెచ్ విధిని నిలుపు చేయించారు.

ఈ సంకేతం బలహీనం కావడంతో జీబ్రా చేప లోని గర్భస్థ పిండం 90 శాతం జనన లోపాన్ని చూపించింది. ఈ లోపాన్ని శాస్త్రీయంగా “సైక్లోపియా” గా పేర్కొంటున్నారు. సైక్లోపియా మనుషుల్లోనూ కనిపిస్తుంది. మధ్యలో ఒకే కన్ను తయారైనా లేదా పాక్షికంగా కన్ను విడిపోయినా సైక్లోపియా కనిపిస్తుంది. ఈ సంకేత వ్యవస్థను సవివరంగా అర్థం చేసుకుంటే అరుదైన ఈ లోపానికి కారణం తెలుస్తుంది. జీబ్రా చేపలో రెటీనా పునరుద్ధరణకు సంకేత వ్యవస్థ కూడా బాధ్యతగా ఉన్నప్పటికీ, మనుషుల్లో ఎందుకు ఆ విధంగా రెటీనా పునరుత్పత్తి జరగడం లేదన్నది ప్రశ్నార్థకమవుతోంది.

పరిశోధకులు మొత్తం రెటీనా ఆర్‌ఎన్‌ఎ అనుక్రమాన్ని రెటీనా గాయపడిన తరువాత సమీక్షించారు. జిక్ 2 బి. ఫాక్స్‌న్ 4, ఎంఎంపి 9 తదితర అనేక జన్యువులకు సంకేత వ్యవస్థ ద్వారా క్రమబద్ధీకరించ బడ్డాయి. జిక్ 2 బి, ఫాక్స్‌న్ 4 జన్యువులు కండరాల ప్రత్యుత్పత్తికి, అభివృద్ధికి ముఖ్యమైన భాగాలు కాగా, ఎంఎంపి 9 అనే ఎంజైమ్ తాజాగా కణాలు ఏర్పడడానికి అనుకూల వాతావరణాన్ని కల్పిస్తుంది. మైక్రో ఆర్‌ఎన్‌ఎ (లెట్ 7) పాత్రను కూడా పరిశోధకులు చూపించారు.

లిన్ 28 ఎ అనే ప్రత్యేక జన్యువు ద్వారా ఇది క్రమబద్ధీకరణ అవుతుంది. ఇది రెటీనా తిరిగి ఉత్పత్తి అయ్యే ప్రక్రియలో సాధారణ సంకేత వ్యవస్థను ప్రవేశ పెడుతుంది. గాయమైన సమయంలో కణ విభజన అవసరం. లెట్ 7 అడ్డుకునే సామర్ధం కలిగి ఉంది. అందువల్ల లిన్ 28 ఎ చర్యకు సిద్ధమవుతుంది. పూర్తిగా లెట్ 7 ను ప్రక్షాళన చేస్తుంది. వివిధ రకాల కణాలు బహు సామర్ధ మూల కణాలుగా మార్పు చెందడానికి దోహద పడుతుంది.

మూల కణాలు ప్రత్యుత్పత్తికి సహాయ పడతాయని పరిశోధకులు వివరించారు. పరిశోధకులు ఇదే విధంగా ఎలుకలపై ప్రయోగాలు చేశారు. ప్రొటీన్‌ను ఇంజెక్టు చేశారు. రెటీనా గాయం తరువాత ఎస్‌హెచ్‌హెచ్ ప్రొటీన్ సులువుగా సంకేత మార్గంగా మారింది. కణ విభజన పెరిగి జన్యువులు క్రమబద్ధీకరణ అయినా, రెటీనా ప్రత్యుత్పత్తి మాత్రం ఎలుకల్లో కనిపించలేదు. ప్రత్యుత్పత్తి వెనుక సంకేతాలు, జన్యువుల పాత్ర అర్ధం చేసుకున్నప్పటికీ, క్షీరద వ్యవస్థలో ప్రయత్నించే ముందు మొత్తం మార్గం, నెట్‌వర్క్‌కు ఎలాంటి చిక్కులు ఉండకూడదని పరిశోధకులు చెప్పారు.
మనిషి వెన్నుపూస మరమ్మతు
జీబ్రా చేప వెన్నెముక నుంచి వెలికి తీసిన ఓ ప్రొటీన్ ఇప్పుడు మనిషి వెన్నుపూస మరమ్మతుకు ఉపయోగపడుతున్నట్టు పరిశోధకులు కనుగొన్నారు. ఆ ప్రొటీన్ మనిషి వెన్నుపూసలో దెబ్బతిన్న డిస్క్‌లను తిరిగి రూపొందించడంలో ప్రధాన పాత్ర వహించ గలదని పరిశోధకులు చెబుతున్నారు. ఇప్పటివరకు డిస్క్‌లు దెబ్బతింటే తిరిగి వాటిని రూపొందించే చికిత్సలు అంటూ ఏవీ లేవు. డిస్క్ మార్పిడి వంటి శస్త్రచికిత్సలు మాత్రం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో జీబ్రా చేప వెన్నెముకలో లభించే సెల్యులర్ కమ్యూనికేషన్ నెట్‌వర్క్ ఫ్యాక్టర్ 3 ఎ (సీసీఎన్2ఎ) ప్రొటీన్ ఎంతో ఉపయోగపడుతోందని తెలుసుకున్నారు. వయోవృ్దద్ధుల్లో క్షీణించే డిస్క్ తిరిగి ఉత్పత్తి అయ్యే ప్రక్రియను ఈ ప్రొటీన్ ప్రేరేపిస్తుందని గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News