Monday, December 23, 2024

రాజ్‌భవన్‌లోనే రిపబ్లిక్ వేడుకలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్‌భవన్‌లోనే కవాతుతో కూడిన వేడుకలు నిర్వహించనున్నారు. ఉదయం ఏడు గంటలకు గవర్నర్ తమిళసై సౌందరరాజన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో రాజ్‌భవన్‌లోనే పరేడ్ నిర్వహించనున్నారు. న్యాయస్థానం ఆదేశాల తర్వాత పో లీస్ అధికారులు, సాధారణ పరిపాలనా శాఖ అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి బిఆర్‌కె భవన్‌లో సమావేశం నిర్వహించా రు.

డిజిపి అంజనీకుమార్, సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి శేషాద్రి, ప్రొటోకాల్ సం చాలకులు అర్వింద్ సింగ్, అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. గణతంత్ర వేడుకల నిర్వహణపై సమావేశంలో చర్చించారు. హైకోర్టు ఆదేశాలకనుగుణంగా రాజ్‌భవన్‌లో వేడుకల నిర్వహణ పై నిర్ణయం తీసుకున్నారు. రాజ్‌భవన్‌లో వేడుక ల నిర్వహణపై దిశానిర్దేశం చేశారు. అనంతరం పోలీస్, ఇతర శాఖల అధికారులు రాజ్‌భవన్‌కు వెళ్లారు.

వేడుకలకు సంబంధించిన నిర్వహణ ఏర్పాట్లను సమీక్షించారు. రాజ్‌భవన్ ప్రాంగణంలో పరేడ్ నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. పోలీసు బలగాలు రాజ్ భవన్ ప్రాంగణంలో పరేడ్ కోసం రిహార్సల్ కూడా నిర్వహించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News