Wednesday, January 22, 2025

అలజడులు సృష్టిస్తే కేసులే..

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/వెంకటాపూర్‌: నేరాల నియంత్రనకే తనీఖీలు నిర్వహిస్తున్నమని, ఏవరైనా అలజడులు సృష్టిస్తే కేసులు తప్పవని వెంకటాపూర్ ఏస్సై తాజుద్దీన్ అన్నారు. బుదవారం వెంకటాపూర్ మండలంలోని బండ్లపహాడ్, భూర్గుపేట, నారయణపురం తదితర గ్రామాల్లో ములుగు ఏస్పీ సంగ్రాంసింగ్ జీ పాటిల్ ఆదేశానుసారం, ఓఎస్డీ గౌస్ అలాం పర్యవేక్షణలో, ములుగు ఏఏస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ ఆధ్వర్యంలో ముమ్మర వాహన తనీఖీతో పాటు కార్డన్‌సర్చ్ నిర్వహించి ప్రజలకు కౌన్సిలింగ్ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సరైన దృవపత్రాలు లేని వాహనలను పోలీసులు అదుపులోకి తీసుకోని క్షుణ్ణంగా పరిశీలించి జరిమాన విధించి వదిలేసినట్లు ఆయన తెలిపారు. పోలీసులకు ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు. ప్రతి గ్రామంలోని ప్రధాన వీధులగుండా సీసీ కెమోరాలు ఎర్పాటు చేసేల చర్యలు తీసుకుంటామన్నారు. రౌడీ షీటర్లకు సంబంధం ఉన్న వ్యక్తులను అధుపులోకి తీసుకోని చర్యలు తీసుకుంటామన్నారు. రేపు జరిగే 26 జనవరి గనతంత్ర వేడుకలను ప్రశాంత వాతవరణంలో జరుపుకోవాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News