- Advertisement -
హైదరాబాద్: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో తెలంగాణ ప్రభుత్వం 76వ రిపబ్లిక్ డే వేడుకలను ఘనంగా నిర్వహిస్తోంది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరై.. జాతీయ జెండాను ఆవిష్కరించారు. తర్వాత గవర్నర్, పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ తోపాటు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, తదితర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ సదర్భంగా పరేడ్ గ్రౌండ్‌లోని అమరవీరుల స్థూపం వద్ద సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి నివాళులర్పించారు.
- Advertisement -