- Advertisement -
హైదరాబాద్: మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ హీరోగా దేవకట్టా దర్శకత్వంలో రూపొందిన సందేశాత్మక చిత్రం ‘రిపబ్లిక్’. జెబి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై జె.భగవాన్, జె.పుల్లారావు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పవర్ఫుల్ పొలిటికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో రమ్యకృష్ణ కీలక పాత్ర పోషిస్తున్నారు. షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాని అక్టోబర్ 1న విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.
Republic movie to release on Oct 1
- Advertisement -