Thursday, January 23, 2025

పాత పిఎస్ పరిధిలోనే కొనసాగించాలని డిసిపికి వినతి

- Advertisement -
- Advertisement -

చాంద్రాయణగుట్ట: సౌత్‌జోన్ పరిధిలో ని ఛత్రినాక పోలీసుస్టేషన్ సరిహద్దులను పాత పద్ధతిలో నే కొనసాగించాలని కోరుతూ ఐక్య కార్యాచరణ సమితి ప్రతినిధులు శనివారం దక్షిణ మండల డీసీపీ పి.సాయి చైతన్యకు వినతి పత్రం అందజేశారు. హెచ్‌సీపీ పునర్వవస్థీకరణలో భాగంగా కొత్తగా జోన్లు, డివిజన్లు, పోలీసుస్టేషన్లు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో చాంద్రాయణగుట్ట పోలీసుస్టేషన్ సరిహద్దులను మార్చారు.
ఛత్రినాక స్టేషన్ పరిధిలో గల ఉప్పుగూడ లలితాబాగ్, కాళీకానగర్, తానాజీనగర్, ఉప్పుగూడ జెండా తదితర ప్రాంతాలను చాంద్రాయణగుట్టకు కలిపారు. దీంతో ఇక్కడి ప్రజలు ఏదైనా ఫిర్యాదు చేయాలన్నా, శాంతిభధ్రతల సమస్య వచ్చిన దూరంలో గల చాంద్రాయణగుట్ట పోలీసుస్టేషన్‌కు వెళ్ళాల్సి ఉంటుంది. సమీపంలో ఉన్న ఛత్రినాక పోలీసుస్టేషన్‌ను వదలి దూరంలో గల చాంద్రాయణగుట్ట పోలీసుస్టేషన్‌కు తమ ప్రాంతాలను కలపటంపై స్థానిక ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలో శుక్రవారం రాత్రి దక్షిణ తూర్పు మండల డీసీపీ రూపేష్, ఏసీపీ మహ్మద్ గౌస్, ఇన్‌స్పెక్టర్లు జావీద్, రమేష్ కుమార్‌లు సరిహద్దును ప్రత్యక్షంగా పరిశీలించారు. ఆ సమయంలో స్థానిక ప్రజలు తమను ఇతర స్టేషన్‌కు కలపటంపై అ భ్యంతరం వ్యక్తం చేశారు. శనివారం ఉప్పుగూడ జెండా వద్ద నిరసన తెలిపి ఛత్రినాక పోలీసుస్టేషన్లో డీసీపీ సాయి చైతన్యను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేసి తగు న్యాయం జరిగేలా చూస్తానని డీసీపీ వారికి హామి ఇచ్చారు. వినతి పత్రం అందజేసిన సమితి ప్రతినిధులలో తాడెం శ్రీనివాసరావు, జమ్మిచెట్టు రాజు, జనగామ మధుసూదన్ గౌడ్, బస్తీవాసులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News