Thursday, November 21, 2024

మేరు కులస్థులను ఆదుకోవాలని ఎమ్మెల్యేకు వినతి

- Advertisement -
- Advertisement -

స్టేషన్ ఘన్‌పూర్: కుట్టుపని పైనే ఆధారపడి జీవిస్తున్న మేరు కులస్థులను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని మేరు సంఘం జిల్లా కన్వీనర్ రాపర్తి సుధాకర్ మేరు కోరారు. శుక్రవారం నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రాజయ్యకు మేరు సంఘం సభ్యులతో కలిసి సుధాకర్ వినతిపత్రం అందచేశారు. ఈ సందర్భంగా సుధాకర్, ప్రశాంత్ మాట్లాడుతూ.. మేరు కులస్థులు తమ కుల వృత్తి కుట్టు పని మీదనే ఆధారపడి జీవిస్తున్నామన్నారు.

నేటి ఆధుని సమాజంలో రెడీమెడ్ దుస్తులు రావడంతో కుట్టు పని తగ్గిపోయి కుటుంబం గడవక ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. మేరు సంఘం సమస్యలను ఎమ్మెల్యే రాజయ్య ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలన్నారు. ప్రభుత్వ టెక్స్‌టైల్ పార్కులు ఏర్పాటుచేసి మేరు కులస్థులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. చిన్న గార్మెంట్ పరిశ్రమలు నెలకొల్పుడానికి ప్రాధాన్యత కల్పించి వడ్డీలేని రుణాలను అందించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో యూనిఫాం కుట్టే పనిని మేరు సంఘాలకు ఇవ్వాలన్నారు.

మేరు సంఘాలకు ప్రభుత్వ భూమిని కేటాయించి కమ్యూనిటీ హాలు నిర్మించి ఉచితంగా జూకీ, పెద్ద కుట్టు మిషన్లు ఇవ్వాలన్నారు. మేరు కులస్థులను బీసీడీ నుంచి బీసీఏలోకి మార్చాలన్నారు. దీనిపై ఎమ్మెల్యే రాజయ్య సానుకూలంగా స్పందించి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు సుధాకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మేరు సంఘం నేతలు సత్యనారాయణ, రాజేందర్, సారంగపాణి, సంపత్, రమేశ్, మురళి, భాస్కర్, శోభన్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News