- Advertisement -
న్యూఢిల్లీ : డాలర్ తో పోల్చుకుంటే రూపాయి విలువ దారుణంగా పతనం కావడంపై కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ మంగళవారం విరుచుకుపడింది. పతనంలో రూపాయి సెంచరీ స్కోరు సాధించకుండా ప్రధాని మోడీయే కాపాడాలని కాంగ్రెస్ విజ్ఞప్తి చేసింది. డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ ఎన్నడూ లేనంతగా దిగజారింది. డాలర్ విలువ 81.30 కి పెరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనటే చరిత్రలో మొట్టమొదటిసారి డాలర్ విలువతో పోల్చితే రూపాయి విలువ 82 వైపు పతనానికి దారి తీస్తోందని పాత్రికేయ సమావేశంలో ఎద్దేవా చేశారు. మోడీజీ దీవెనల కారణంగా చరిత్రలో ఎన్నడూ లేనంతగా రూపాయి బలహీన పడిందని వ్యాఖ్యానించారు. రూపాయి విలువ పతనాన్ని నేరుగా మోడీ విశ్వసనీయత పతనంతో పోల్చారు.
- Advertisement -