Thursday, January 23, 2025

మోత్కూరులో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయాలని వినతి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/మోత్కూరు: మోత్కూరు మున్సిపల్ కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, ఆర్టీసీ బస్ డిపో ఏర్పాటు చేయాలని కోరుతూ బుధవారం మోత్కూరు వచ్చిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డికి బిసి రిజర్వేషన్ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు బుర్ర శ్రీనివాస్‌గౌడ్ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ ప్రాంతంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ లేకపోవడంతో పేద, మధ్య తరగతి విద్యార్థులు హైదరాబాద్ లాంటి పట్టణాలకు వెళ్లి ఉన్నత విద్య చదువుకోలేక చదువు మధ్యలోనే మానేస్తున్నారని, పేద విద్యార్థుల ఉన్నత చదువుల కోసం ప్రభుత్వం డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయాలని కోరారు. గ్రామీణ ప్రాంతాలకు రవాణా సదుపాయం మెరుగుపర్చేందుకు మోత్కూరులో ఆర్టీసీ బస్ డిపో ఏర్పాటుకు కృషి చేయాలని విన్నవించారు. శాసనమండలిలో ఈ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మంజూరు కోసం కృషి చేస్తానని ఎమ్మెల్సీ హామీ ఇచ్చినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిసి రిజర్వేషన్ సాధన సమితి పట్టణ అధ్యక్షుడు నిలిగొండ మత్సగిరి, బుంగ యాదయ్య, యామగాని బుగ్గయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News