Monday, December 23, 2024

గిరిజన తండాలను నూతన గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేకు వినతి

- Advertisement -
- Advertisement -

అక్కన్నపేట : అక్కన్నపేట మండలం రామవరం గ్రామ పంచాయతీ పరిధిలోని బంగారులొద్ది తండా నూతనంగా ఏర్పాటైన పునరావాస కాలనీకి చెందిన గిరిజన తండాలను కలుపుకొని నూతన గిరిజన గ్రామ పంచాయతీని ఏర్పాటు చేయాలని ఆదివారం హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్‌కుమార్ క్యాంపు కార్యాలయంలో తండావాసులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగావారు మా తండాలలో 300 కుటుంబాలు అంటే అందాద ఎనిమిది వందల మంది జనాభా కలిగి ఉన్నామని ఇందులో 500 వరకు ఓటర్లు కలరని ఎమ్మెల్యేకు వివరించారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 500 జనాభా కలిగి ఉన్న తండాలను నూతన గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేశారని దీన్ని ఉద్దేశించి మా అర్హత గల తండాను కూడా నూతన గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ బానోతు బాస్కర్, గ్రామస్థులు తిరుపతి, దేవేందర్ తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News