Monday, January 20, 2025

బిల్డాక్స్‌కు భారీ జరిమానా!

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : ఐటీ ఉద్యోగులనే లక్షంగా చేసుకొని వా రిని నిండా ముంచేసిన ‘బిల్డాక్స్’ రి యల్ సంస్థకు రెరా భారీగా జరిమానా విధించింది. గతనెల ‘మనతెలంగాణ’లో ‘బిల్డాక్స్’ బిల్డప్..? పే రిట ప్రచురితమైన కథనానికి రెరా స్పందించింది. ఇప్పటికే ఆ సంస్థపై ఫిర్యాదు చేసిన వినియోగదారుల దగ్గరి నుంచి రెరా స్టేట్‌మెంట్‌ను రి కార్డు చేసింది. గతంలో ఒకసారి రెరా అధికారులు హియరింగ్‌కు పి లిచినప్పుడు ‘బిల్డాక్స్’ సంస్థ తరపు న హాజరైనఆ సంస్థ ప్రతినిధులు తా ము ఎలాంటి ఫ్రీలాంచ్‌లకు పాల్పడడం లేదని వాదనలు వినిపించా రు. ఈ నేపథ్యంలోనే వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులను వారి ఎదుట ఉంచి ఈ కేసును రె రా విచారించింది. తమ పేరుపై ఎవరో కావాలని తప్పుడు ప్రచా రం చేస్తున్నారని ‘బిల్డాక్స్’ తరపున హాజరైన ప్రతినిధులు రె రాకు తప్పుడు పత్రాలను సమర్పించారు.

అయితే తమ సంస్థ తరపున హఫీజ్ పేటలోని సర్వేనెం. 80లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదని, తమపై వ చ్చిన వార్తలు నిరాధారమ ని, ఆ భూమి తమది కాదనీ, బిల్డా క్స్ ప్రతినిధులు రెరా అధికారులతో పేర్కొని రెరాను తప్పుదోవ పట్టించా రు. తమ సంస్థకు కేవలం భువని/వాసవి భురిడాక్స్ అనే ప్రాజెక్టు పే రుతో గుండ్లపోచంపల్లి (సర్వే నెం. 509/pard) నందు పిఓ 220000 7044 నెంబర్‌తో బిల్డాక్స్ కంపెనీ ‘రెరా’ రిజిస్ట్రేషన్ కలిగి ఉ న్నట్లు ఈ సంస్థ ప్రతినిధులు రెరా తో తెలిపా రు. ఈ నేపథ్యంలోనే మ రోసారి బి ల్డాక్స్ కేసుకు సంబంధించిన హియరింగ్‌ను గురువారం రెరా అధికారులు చేపట్టారు. గతనెల 08వ తేదీ నుంచి ఇప్పటివరకు బిల్డాక్స్ సంస్థ సోషల్‌మీడియాలో చేస్తున్న ఫ్రీలాంచ్ దందాపై రెరా అధికారులు దృష్టి సారించారు. గతనెల నుంచి ఇప్పటివరకు ‘బిల్డాక్స్’ సంస్థ ఫ్రీలాంచ్ దందాను ఆపలేదన్న విషయాన్ని రెరా నిర్ధారించుకుంది. ఈ నేపథ్యంలోనే ఆ సంస్థకు భారీగా జరిమానా విధిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. సోషల్‌మీడియా ద్వారా ప్రస్తుతం ‘బిల్డాక్స్’ సంస్థ హఫీజ్ పేటలోని సర్వేనెం. 80లో ప్లాట్లను విక్రయిస్తుందని, దీనికి సంబంధించి సోషల్‌మీడియాలో ఉన్న బ్రోచర్, ఫొన్ నెంబర్‌ల ఆధారంగా ఈ సంస్థకు రెరా జరిమానా విధించింది.

బిల్డాక్స్ విజ్ఞప్తిని తోసిపుచ్చిన ‘రెరా’ అధికారులు

బిల్డాక్స్ ప్రాజెక్టు విషయంలో ‘రెరా ’ ట్రిబ్యునల్ గురువారం హియరింగ్ (విచారణ) జరిపిన ఆధారంగా బిల్డాక్స్ ప్రాజెక్టుకు రూ.3 కోట్ల 96 లక్షల 39 వేల 600లు అపరాధ రుసుంగా విధించింది. బిల్డాక్స్ జారీ చేసిన ప్రకటన ఫేస్‌బుక్ లో ఇంకా (లైవ్) లో కొనసాగుతుండడంతో ఈ కారణంగా ప్రజలకు తప్పుడు సమాచారం చేరవేస్తూ సంబంధిత వ్యక్తుల నుంచి నగదు వసూళ్లకు పాల్పడుతున్నట్లు గ్రహించి ‘రెరా’ చట్టంలోని సెక్షన్ 59, 60 రెడ్విత్ 38 ప్రకారం రూ.3 కోట్ల 96 లక్షల 39 వేల 600లు జరిమానాగా విధిస్తున్నట్టు ‘రెరా అథారిటీ తెలిసింది. బిల్డాక్స్ తరఫు న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేయడానికి మూడు వారాల సమయం కావాలని కోరినప్పటికీ, ఫేస్‌బుక్‌లో ‘బిల్డాక్స్’ ప్రాజెక్టు ప్రకటన ఇంకా కొనసాగడాన్ని పరిగణలోకి తీసుకొని కొనుగోలు దారులు మోసాలకు గురికాకుండా వారిని అప్రమత్తం చేయడానికి ఆ సంస్థకు అపరాధ రుసుము విధిస్తున్నట్టు రెరా తెలిపింది. ఇదే ప్రాజెక్ట్ విషయంలో రానున్న రోజుల్లో ఎలాంటి ప్రకటనలు, మార్కెటింగ్, విక్రయాలు కొనసాగించరాదని రెరా అథారిటీ బిల్డాక్స్‌కు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఫేస్‌బుక్ ప్రకటనలు వెంటనే తొలగించాలని రెరా ట్రిబ్యునల్ బిల్డాక్స్‌ను ఆదేశించింది.

రెరా అనుమతులు లేని ప్రాజెక్టుల్లో పెట్టుబడులు వద్దు
‘రెరా’ అనుమతులు లేని రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులలో పెట్టుబడి పెట్టి, కొనుగోలు చేసి మోసపోరాదని కొనుగోలుదారులకు ‘రెరా’ అథారిటీ సూచించింది. కొనుగోలుదారులకు భరోసా కల్పిస్తూ వారి రక్షణ కోసం రెరా అథారిటీ అన్ని చర్యలు తీసుకుంటుందని అథారిటీ తెలిపింది. ‘రెరా’ రిజిస్ట్రేషన్ పొందకుండా వ్యాపార ప్రకటనలు జారీ చేయడం, మార్కెటింగ్ కార్యకలాపాలు నిర్వహించడం ‘రెరా’ నిబంధనలు ఉల్లంఘించినట్లుగా భావించి తగిన చర్యలు తీసుకుంటామని అథారిటీ స్పష్టం చేసింది. అదేవిధంగా ఫ్రీ-లాంచ్ పేరుతో అమ్మకాలు చేపట్టడం ‘రెరా’ చట్టం ప్రకారం శిక్షర్హులుగా పరిగణించి తగిన చర్యలు తీసుకుంటామని రెరా హెచ్చరించింది. రెరా చట్టం నిబంధనల మేరకు డెవలపర్లు, ప్రమోటర్లు సంబంధిత సంస్థల నుంచి అన్ని అనుమతులు పొందిన వెంటనే వాటిని రెరా అధికారిక వెబ్‌సైట్‌లో పెట్టి, ఆ ప్రాజెక్ట్ పూర్తి వివరాలు నమోదు చేసి రెరా రిజిస్ట్రేషన్ పొందాలని అథారిటీ పేర్కొంది. కొనుగోలుదారుల నమ్మకానికి పూర్తిస్థాయి భరోసా ఇవ్వడానికి రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు క్రమం తప్పకుండా త్రైమాసిక, వార్షిక నివేదికలను విధిగా ‘రెరా’ వెబ్‌సైట్ లో ప్రాజెక్టు అభివృద్ది వివరాలను పొందుపరచాలని రెరా’ అథారిటీ ఆదేశించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News