మన తెలంగాణ/హైదరాబాద్: ‘రెరా’ ని బంధనలు ఉల్లంఘిం చిన సోనెస్టా ఇన్‌ఫినిటి, హస్తినా రియాల్టీ ప్రైవేట్ లిమిటెడ్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు రెరా అథారిటీ ఒక ప్రకటనలో తెలిపింది. గచ్చిబౌలి కేర్ హాస్పటల్ వెనుక ఉన్న జయభేరి ఫైన్ కాలనీలో స్కై విల్లాస్ నిర్మాణాలకు సోనెస్టా ఇన్‌ఫిని టి ప్రమోటర్ ’రెరా’ రిజిస్ట్రేషన్ పొం దకుండానే సోషల్ మీడియా ద్వారా బ్రోచర్ విడుదల చేసిందని రెరా ఆరోపించింది.
అలాగే హస్తిన రియాల్టీ ప్రైవేట్ లిమిటెడ్ ప్ర మోటర్స్ ”బ్రిస్సా” ప్రాజెక్టు పేరుతో శ్రీశైలం హైవే సమీపంలోని కడ్తాల్ టౌన్ ఫార్మా సిటీ వద్ద ”రెరా” రిజిస్ట్రేషన్ లేకుండా సోషల్ మీడియా ద్వారా బ్రోచర్ విడుదల చేసి, వెబ్‌సైట్, సోషల్ మీడియా ద్వారా ప్రజలను, కొనుగోలుదారులను ఆకర్షించేందుకు విస్తృత ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం ”రెరా” అథారిటీ దృష్టికి రా వడంతో ఈ రెండు ప్రాజెక్టుల యజమానులకు షోకాజ్ నోటీసులు జారీ చేసి, వారం రోజుల్లోగా సంజాయిషీ ఇవ్వాలని అథారిటీ ఆదేశించింది.
రెరా చట్టంలోని 3 (1), 4(1) నిబంధనల ప్రకారం రి యల్ ఎస్టేట్ ప్రాజెక్టలు, ఏజెంట్లు తప్పనిసరిగా తమ ప్రాజెక్టలను రెరాలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, లేనిచో సదరు ప్రాజెక్టులు నిబంధనలు ఉల్లంఘించినట్లు భావించి సెక్షన్ 59 ప్రకారం అపరాధ రు సుము విధించడంతో పాటు క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు రె రా అథారిటీకి అధికారం ఉందని పేర్కొనారు. ఇళ్లు, ఫ్లాట్లు కొనుగోలు చేయదలచిన వారు ఎవరైనా ’రెరా’ రిజిస్టర్ ప్రాజెక్టులో మా త్రమే కొనుగోలు చేయాలని, ప్రీలాంచ్ ఆఫర్లు, మోసపూరిత ప్రకటనలు నమ్మి ఎవ్వరూ మోసపోవద్దని రెరా అథారిటీ ప్రజలకు విజ్ఞ ప్తి చేసింది. రెరా నిబంధనలు ఉల్లంఘించిన రియల్టర్స్, భవన ని ర్మాణదారులపై వాట్సాప్ నెం. 9000006301, ఫోన్ నెం. 404 29394972లకు ఫిర్యాదు చేయాలని పేర్కొంది.