సాహసానికి మారుపేరైన భారత సైన్యం అత్యంత రిస్క్ తీసుకుని సోమాలియా తీరానికి సమీపంలో ఓ వ్యాపారి నౌకలోని 17 మంది సిబ్బందిని రక్షించింది. పొగమంచు, చీకటి, గజగజ వణికిస్తున్న చలిలో భారత బలగాలు సాహసోపేతమైన ఆపరేషన్ వివరాలను ప్రభుత్వం బహిరంగంగా తెలియజేసింది. 10-గంటల మిషన్లో, ఇండియన్ సీ-17 విమానం సోమాలి తీరానికి సమీపంలో 18 మంది కమాండోలను నడి సముద్రంలో దింపింది. కమాండోలు రెండు రైడింగ్ క్రాఫ్ట్ బోట్లను వెళ్లి సోమాలియా తీరంలోని సముద్ర దొంగల బారినుంచి ఓ వ్యాపారి నౌకను, 17 మంది సిబ్బందిని రక్షించారు.
వాయు సేన పతకం పొందిన వింగ్ కమాండర్ అక్షయ్ సక్సేనా ఆధ్వర్యంలో ఈ పది గంటల సాహస కార్యం పూర్తయింది. భారత సైన్యం సాహసం మరో సారి నిరూపణ అయింది.సముద్ర దొంగలు పసి కట్టే అవకాశం ఇవ్వకుండా మెరుపు వేగంతో నిర్వహించిన రిస్క్ మిషన్ కోసం వింగ్ కమాండర్ సక్సేనా, కమాండోలను ఎంపిక చేశారు. మిషన్ విజయవంతం అయింది. సముద్ర దొంగల వద్ద శక్తివంతమైన ఆయుధాలే ఉన్నాయి. దీంతో అత్యంత రహస్యంగా మరో దేశం గుర్తించకుండా దాదాపు నాలుగు గంటలపాటు ఆ దేశ గగనతలంపై తిరుగుతూ..సాహసంతో ఈ మిషన్ ను భారత కమాండోలు సక్సెస్ చేశారు.