Thursday, January 23, 2025

జోషిమఠ్‌లో ఇళ్ల కూల్చివేతలు ప్రారంభం!

- Advertisement -
- Advertisement -

జోషిమఠ్: ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్ పట్టణంలో మంగళవారం ఇళ్ల కూల్చివేతలు ప్రారంభం అయ్యాయి. పగుళ్లు ఏర్పడిన ఇళ్లు, హోటళ్లను అధికారులు కూల్చివేశారు. ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎస్. సందు సురక్షితం కాని నిర్మాణాలను శాస్త్రవేత్తల పర్యవేక్షణలో కూల్చివేయాలని ఉత్తర్వులు జారీ చేశారు.

జోషిమఠ్‌లో భూమి కుంగడంతో ఇళ్లలో పగుళ్లు ఏర్పడ్డాయి. పగుళ్లు ఏర్పడిన ఇళ్ల సంఖ్య ఇప్పుడు 678కి పెరిగింది. జోషిమఠ్ వాసులు ఇళ్లు వదిలి తాత్కాలిక ఆశ్రమాలకు చేరారు. మరో 27 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని విపత్తు నిర్వహణ అథారిటీ తెలిపింది. దెబ్బ తిన్న ఇళ్లకు అధికారులు రెడ్ క్రాస్ మార్కులు వేశారు. బాధిత కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి నెలకు రూ. 4వేల రూపాయాల ఆర్థిసాయం ఇచ్చారు. ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ ధామి దెబ్బతిన్న ప్రాంతాలను సందర్శించి బాధితుల కష్టనష్టాలు అడిగి తెలుసుకున్నారు. చమోలిలో భద్రత, కాపాడే చర్యల కోసం అదనంగా రూ. 11 కోట్లు విడుదల చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News