Sunday, December 22, 2024

సురక్షితంగా బయట పడిన రాజు

- Advertisement -
- Advertisement -

కామారెడ్డి : మూడు రోజులుగా బండరాళ్ల మధ్య నరకయాతన పడిన శాడ రాజును ఎట్టకేలకు సురక్షితంగా వెలికి తీశారు. వివిధ శాఖల అధికారులు, సిబ్బంది 43 గంటల రెస్క్యూ ఆపరేషన్ తర్వాత క్షేమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. గురువారం మధ్యాహ్నం 1.50 గంటలకు రాళ్ల మధ్య నుండి బయటకు తీశారు. అక్కడే ఉన్న రామారెడ్డి మండల వైద్యాధికారి పరీక్షించిన తర్వాత ప్రత్యేక అంబులెన్సు ద్వారా ఆసుపత్రికి తరలించారు. మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లిన రాజు తిరిగి రాలేదు. అప్పటి నుండి బండ రాళ్ల మధ్య నరకయాతన అనుభవించాడు. రాజు ప్రాణాలతో బయట పడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News