Friday, November 15, 2024

సొరంగం లోని కార్మికులను రక్షించే యత్నం..

- Advertisement -
- Advertisement -

ఉత్తరకాశి (ఉత్తరాఖండ్) : ఉత్తరకాశి సొరంగంలో చిక్కుకున్న 40 మంది కార్మికులను బయటకు తీసుకురాడానికి ఇంతవరకు ఉపయోగించిన డ్రిల్లింగ్ మెషిన్ వల్ల ఫలితం లేకపోవడంతో ఢిల్లీ నుంచి భారీ డ్రిల్లింగ్ మెషిన్‌ను రప్పించారు. ఈ భారీ డ్రిల్లింగ్ మెషిన్ రెండు భాగాలుగా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌హెర్కులెస్ ద్వారా సొరంగానికి 30 కిమీ దూరాన గల చిన్యలిసౌర్ హెలిప్యాడ్‌కు బుధవారం మధ్యాహ్నం చేరుకుంది. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో చేరుకుంటుందని ఉత్తరకాశి పోలీస్ సూపరింటెండెంట్ అర్పణ్ యదువంశీ చెప్పారు. ఆ మెషిన్ రాగానే డ్రిల్లింగ్ ఆపరేషన్ ప్రారంభిస్తామని తెలిపారు.

గంటకు నాలుగైదు మీటర్ల లోతుకు శిధిలాలను దొలిచే సామర్థం కలిగిన ఈ యంత్రం 50 మీటర్ల లోతుకు 10 గంటల్లో చొచ్చుకుని వెళ్తుందని తాము భావిస్తున్నామని ఎన్‌హెచ్‌ఐడిసిఎల్ డైరెక్టర్ అంశు మనీష్ ఖాల్కో చెప్పారు. ఎంతసమయంలో కార్మికులను బయటకు తీసుకురాగలమో చెప్పలేమని, వీలైనంత వేగంగా క్షేమంగా వారిని తీసుకురాడానికి ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని తెలిపారు. అయితే మిగతా కార్మికులు సొరంగ ముఖద్వారం వద్ద చేరి డ్రిల్లింగ్ ఆలస్యం అవుతున్నందుకు నిరసనగా నినాదాలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News