హైదరాబాద్ : క్యాన్సర్ రోగులు ఎక్కువమందికి చికిత్స అందించడానికి వీలుగా బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిలో రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ కేర్ యూనిట్‌ను ఏర్పాటు చేశారు. ఆసుపత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై రీసెర్చి సెంటర్ ప్రారంబించారు. ఇదివరకే ఉన్న డే కేర్ యూనిట్ ఒకటి, రెండు,మూడులలో ఉన్న 24 పడకలకు మరో 21 పడకలు డే కేర్ యూనిట్ మూడులో అందుబాటులోకి వచ్చాయి. ఆనాలుగు యూనిట్లతో పాటు ఇతర వార్డులలో అందుబాటులో ఉన్న పడకలన్నింటితో కలుపుకుని డే కేర్ చికిత్సకు మొత్తం 181 పడకలు రోగులు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. నానాటికీ పెరుగుతున్న రోగులకు ఆలస్యం కాకుండా క్యాన్సర్ చికిత్స అందించడానికి వీలుగా సౌకర్యాలు కల్పించడం జరగుతోందన్నారు. అటు ఆరోగ్యశ్రీ కింద చికిత్స తీసుకునే వారికి ఇప్పటికే పడకలు పెంచామని, అదే విధంగా ఇతరత్రా కేటగిరీల కింద చికిత్సకు వచ్చే వారికి కూడా సదుపాయాలు పెంచే ప్రక్రియ కింద ఈ నూతన డే కేర్ వార్డులను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు.