Thursday, January 23, 2025

పరిశోధక విద్యార్థులు ఐసీఎస్‌ఎస్‌ఆర్ సేవలను వినియోగించుకోవాలి : ప్రొఫెసర్ రవీందర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ ః పరిశోధక విద్యార్థులు నాణ్యమైన పరిశోధనలు చేయాలని ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ రవీందర్ సూచించారు. ఆ దిశగా పరిశోధక విద్యార్థులు ఐసిఎస్‌ఎస్‌ఆర్ సేవలను వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. శనివారం ఓయూ సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ స్టడీస్ ప్రాంగణంలో నెలకొల్పిన ఐసీఎస్‌ఎస్‌ఆర్-ఎస్‌ఆర్సీ నూతన ప్రాంగణాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశోధక విద్యార్థులకు మెరుగైన సేవలు అందించేందుకు ఐసిఎస్‌ఎస్‌ఆర్ డైరెక్టర్ ప్రొఫెసర్ బి. సుధాకర్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలను అభినందించారు. యూనివర్సిటీ నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. యూనివర్సిటీలో విద్యావ్యవస్థను గాడిన పెట్టేందుకు అనేక సంస్కరణలను ప్రవేశపెట్టినట్లు వివరించారు.

ఓయూకు పూర్వ వైభవం సాధించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం ప్రొఫెసర్ సుధాకర్ రెడ్డి ప్రసంగిస్తూ కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో దేశంలో సామాజిక శాస్త్రాల పరిశోధనను ప్రోత్సహించేందుకు 1969లో ఐసీఎస్‌ఎస్‌ఆర్ ను ప్రారంభించారని గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా ఆరు ప్రాంతీయ కేంద్రాలతో ఇది పనిచేస్తుందని చెప్పారు. ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలతో పాటు లక్షద్వీప్, పాండిచ్చేరి కేంద్రపాలిత ప్రాంతాల పరిధిగా దక్షిణ ప్రాంతీయ కేంద్రాన్ని ఉస్మానియా యూనివర్సిటీలో 1973 ఫిబ్రవరి ఒకటవ తేదీన ప్రారంభించాలని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఓయూ రిజిస్టర్ ప్రొఫెసర్ పి లక్ష్మీనారాయణ, ఓయూసీఐఎస్ డైరెక్టర్ ప్రొఫెసర్ కృష్ణ కుమార్, ఇండో పసిఫిక్ స్టడీస్ డైరెక్టర్ ప్రొఫెసర్ జేఎల్‌ఎన్ రావు, పి జి ఆర్ ఆర్ సి డి ఈ డైరెక్టర్ ప్రొఫెసర్ జిబి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News