Thursday, January 23, 2025

కేరళలో కొత్తరకం ‘వాలుగ చేప’కు ప్రజల పేరు

- Advertisement -
- Advertisement -

కేరళలో భూగర్భజల చేపల్లో కొత్త రకం వాలుగ చేప (cat fish) తెగలను పరిశోధకులు కనుగొన్నారు. హొరాగ్లానిస్ పాప్యులి ( horaglanis populi) అన్న శాస్త్రీయ నామం పేరు పెట్టారు. లాటిన్ భాషలో పాప్యులి అంటే ప్రజలు అని అర్థం. ప్రజల సహకారంతోనే ఈ కొత్త రకం వాలుగ చేపలను కనుగొనడమైనందున ఆ చేపకు శాస్త్రీయంగా ఈ పేరుతో పిలుస్తున్నట్టు పరిశోధకులు వివరించారు. ఈ చేపల మనుగడ కేవలం బావులకే పరిమితం అని పరిశోధకులు వివరించారు.

ఈ చేప హొరాగ్లానిస్ ( horaglanis )వంశానికి చెందినది. కేరళ లోని మల్లప్పిల్లి, కొట్టాయం, బావుల్లోంచి ఈ తెగ చేపలను సంగ్రహించ గలిగారు. ఇవి పూర్తిగా నీటికే పరిమితం. ఎలాంటి రంగు వీటికి ఉండవు. ఈ పరిశోధన ఫలితాలు జర్మనీ లోని సెంకెన్‌బెర్గ్ మ్యూజియం కు చెందిన ఇంటర్నేషనల్ జర్నల్ “ వెర్టెబ్రేట్ జూఆలజీ ” ( vertebrate zoology) లో ప్రచురించారు. పరిశోధకులు రాఘవన్, రెమ్య ఎల్. సుందర్, సిపి అర్జున్, రాల్ఫ్ బ్రిట్జ్, నీలేష్ డహనూకర్ ఈ పరిశోధనలు ఆరేళ్ల పాటు నిర్వహించారు. వీటి వైవిధ్యం, వ్యాప్తి , సంతతి, తెలుసుకోడానికి ప్రజల సహకారం తీసుకున్నారు.

ఇప్పుడు కొత్తగా వెలుగు లోకి వచ్చిన ఈ రకం చేపలతో కేరళ భూగర్భ జలాల వివిధ రకాల చేపల సంఖ్య 12 కి పెరిగింది. మల్లప్పిల్లియే కాకుండా ఎడనాడు, చెంగన్నూర్, తిరువన్‌వందూర్ కంకర నేలల్లోని బావుల్లో ఈ కొత్త రకం చేపలు కనిపించాయి. డిమోగ్రాఫిక్స్, అనాటమికల్ అనాలిసిస్, మైక్రో సిటి వంటి అత్యంత ఆధునిక సాంకేతికతను ఉపయోగించి ఈ చేపలను కనుగొనడమైందని పరిశోధకులు సిపి అర్జున్ వివరించారు. ఈమేరకు చేపట్టిన సర్వేలో రాష్ట్రంలోని కంకర నేలల్లో నమూనాలు సేకరించారు. బావులు, బోరింగ్ బావులు, సహజమైన తేమ భూములు తదితర ప్రాంతాల్లో నమూనాలు సేకరించారు. ఈ అధ్యయనం ప్రాముఖ్యత ఆయా ప్రాంతాల ప్రజలకు వివరించి పరిశోధనలో వారి సహకారాన్ని కూడా పరిశోధకులు తీసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News