Friday, December 20, 2024

కొవిడ్ నుంచి రక్షణ కల్పించే జీన్‌ను గుర్తించిన పరిశోధకులు

- Advertisement -
- Advertisement -

Researchers identified gene that protects against Covid

నేచర్ జెనెటిక్స్

లండన్: మనుషుల్లో ఒక ప్రత్యేకమైన జీన్ వేరియంట్‌కు చెందినవారిలో కొవిడ్19 వల్ల తీవ్ర ముప్పు లేదని ఓ అధ్యయనంలో వెల్లడైంది. భిన్నమైన వారసత్వాలకు చెందినవారిలో కొవిడ్ తీవ్రతను పరిశీలించడం ద్వారా పరిశోధకులు ఈ జీన్‌ను గుర్తించారు. స్వీడన్‌లోని కరోలిన్‌స్కా ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో ఈ పరిశోధన జరిగింది. వివరాల్ని నేచర్ జెనెటిక్స్‌లో ప్రచురించారు. మొదట ఈ అధ్యయనాన్ని యూరోపియన్ వారసులపై నిర్వహించారు. వారి డిఎన్‌ఎలోని జీన్స్‌ను ఎన్‌కోడ్ చేయగా ఈ విషయం బయటపడింది. ఆఫ్రికాకు బయటివారైన వీరిలోని సగంమందిలో ఈ ప్రత్యేక జీన్‌ను గుర్తించారు. వీరంతా నియాండర్తల్ వారసులకు సంబంధించినవారు.

ఈ జీన్ ఉన్నవారిలో కొవిడ్ ఇన్‌ఫెక్షన్ ముప్పు 20 శాతంమేర తక్కువగా ఉన్నట్టు గుర్తించారు. ఆ తర్వాత ఆఫ్రికన్లపై అధ్యయనం చేశారు. నియాండర్తల్‌కు చెందినవారు మొదట ఆఫ్రికా నుంచి వెళ్లినవారన్నది గమనార్హం. ఆ తర్వాత వారు యూరోపియన్‌జాతిగా పరిణమించారు. వీరితో సంబంధం లేకుండా వచ్చినవారు ఇప్పటి ఆఫ్రికన్ వారసులు. వీరిలో మెజార్టీలో ఈ జీన్‌ను గుర్తించారు. ఈ జీన్ రెండుజాతుల వారసుల్లోనూ ఒకేవిధంగా ఉండటాన్ని గుర్తించారు. ఈ అధ్యయనం కొవిడ్ బాధితులైన 2787మంది ఆఫ్రికన్ వారసులపై, 1,30,997 మంది ఇతరులపై జరిగింది. మొత్తమ్మీద ఆఫ్రికన్ వారసుల్లోని 80 శాతంమందిలో కొవిడ్ నుంచి రక్షణ కల్పించే జీన్ ఉన్నదని పరిశోధకులు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News