Wednesday, January 22, 2025

గుర్తుల గుబులు…

- Advertisement -
- Advertisement -

రెండు ఈవిఎంలు ఉన్నచోట కొత్త ఓటర్లు, వృద్దులు తికమక
డమ్మీ బ్యాలెట్లతో ప్రచారం చేస్తే ఆలస్యంగా గుర్తింపు
రోడ్ రోలర్, చపాతి రోలర్, ట్రాక్టర్ గుర్తులు త్వరగా గుర్తింపు
గత ఎన్నికల్లో పలువురు అభ్యర్థులు స్వల్వ మెజార్టీతో ఓటమి
ఎల్బీనగర్ మూడు ఈవిఎంలు, నారాయణపేట, బాన్సువాడలో ఒకటే ఈవిఎం

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఎన్నికల పోరు ఉదృతంగా సాగుతున్నా మరోపక్క అభ్యర్థులకు గుర్తుల గుబులు పట్టుకుంటుంది. ఒకే విధంగా పోలిన గుర్తులు రావడంతో అటువైపు ఓటర్లు మొగ్గు చూపుతారనే భయం వెంటాడుతుంది. దీనికి తోడు ఎన్నికల అధికారులు ఎక్కువ అభ్యర్థులు ఉన్న చోట రెండు ఈవిఎంలు ఏర్పాటు చేస్తుండటంతో మొదటి ఈవిఎంపై ఒకే రకంగా పోలిన గుర్తు ఉంటే కొత్త ఓటర్లు, వృద్దులు వేసే ప్రమాదముందని తర్జన భర్జన పడుతున్నారు. వారం రోజుల నుంచి బూత్ ఇంచార్జీలకు డమ్మీ బ్యాలెట్లు ఇచ్చి ఇంటింటికి ప్రచారం చేయిస్తే రెండు ఈవిఎంలు ఉన్నచోట గుర్తులు ఆలస్యంగా పసిగడుతున్నట్లు అభ్యర్థులకు చెబుతున్నట్లు తెలిసింది. త్రిముఖ పోటీ ఉన్న చోట విజయం సాధించే అభ్యర్ధి స్వల్ప మెజార్టీతో గెలిచే అవకాశం ఉండటంతో ఆ నియోజకవర్గంలో పోటీ చేసిన జాతీయ, రిజిస్ట్రర్ పార్టీల అభ్యర్ధులు గుర్తుల సమస్యను ఏవిధంగా అధిగమించాలో తలపట్టుకుంటున్నారు.

ఒక ఈవిఎంలో 16 గుర్తులు ఉంటాయని చివరిగా నోటా ఉంటుంది. తక్కువ అభ్యర్థులు ఉన్నచోట ఒక ఈవిఎం సరిపోతుందని, 16 మంది కంటే ఎక్కువ ఉంటే రెండు ఈవీఎంలు ఏర్పాటు చేస్తామని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో రెండు ఈవిఎంలు ఉపయోగించే నియోజకవర్గాలు వివరాలు పరిశీలిస్తే… ఎల్బీనగర్ 48మంది, గజ్వేల్ 44, కామారెడ్డి 39, మునుగోలు 39, పాలేరు 37, నాంపల్లి 34, కోదాడ 34, మల్కాజిగిరి 33, ఉప్పల్ 32, ఖమ్మం 32, శేరిలింగంపల్లి 31, ముషీరాబాద్ 31, నల్లగొండ 31, కొత్తగూడె 30, వరంగల్ ఈస్ట్ 29, సంగారెడ్డి 28, పరకాల 28, కరీంనగర్ 27, మహేశ్వరం 27, మలక్‌పేట 27, యాకుత్‌పురా 27, ఆదిలాబాద్ 25, ఖైరతాబాద్ 25, కల్వకుర్తి 24, హుజూర్‌నగర్ 24, మిర్యాలగూడ 23, రామగుండం 23 మంది పోటీ చేస్తుండటంతో ఈ నియోజకవర్గాల్లో రెండు నుంచి మూడు ఈవిఎం పెట్టనున్నట్లు రిటర్నింగ్ అధికారులు వెల్లడిస్తున్నారు. అదే విధంగా అతి తక్కువ నారాయణపేట, బాన్సువాడలో 7 మంది చొప్పన బరిలో నిలబడ్డారు. ఈవిఎంలో ముందుగా జాతీయ పార్టీల వారీగా అభ్యర్ధుల గుర్తులు ఉండగా తరువాత ప్రాంతీయ పార్టీలు, రిజిష్ట్రర్ పార్టీల అభ్యర్ధులు ఉంటారు. వీరి తరువాత స్వతంత్ర అభ్యర్థులవి తెలుగు వర్ణమాల క్రమంలో గుర్తులు పొందుపరుచుతారు.

ప్రధాన పార్టీల అభ్యర్థులకు రోడ్డు రోలర్, చపాతీ రోలర్ సమస్య:  గతంలో జరిగిన ఎన్నికల్లో ఈరెండు గుర్తులకు చెందిన అభ్యర్థులు సుమారు 5వేల నుంచి 6వేల ఓట్లు పొందారు. దీంతో అక్కడ జాతీయ పార్టీల అభ్యర్థులకు ఆశించిన దానికంటే తక్కువ ఓట్లు పోలైయ్యాయి. వాటిపై కేంద్ర ఎన్నికల సంఘంను వివిధ పార్టీలకు చెందిన నాయకులు కలిసి వాటిని తొలగించాలని కోరారు. అయిన ఈఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించడంతో పాటు ఈవిఎంలు రెండు కంటే ఎక్కువ ఉండటంతో తమ విజయానికి గండిపడుతుందని పలువురు అభ్యర్థులు అనుచరులు వద్ద ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News