Saturday, November 23, 2024

ట్రాన్స్‌జెండర్లకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలి: తొలి ట్రాన్స్‌జెండర్ జడ్జి

- Advertisement -
- Advertisement -

ట్రాన్స్‌జెండర్లకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలి
తొలి ట్రాన్స్‌జెండర్ జడ్జిజోయిత్ మోండల్ సూచన

ఇండోర్: ట్రాన్స్‌జెండర్లకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించడం అత్యంత ముఖ్యమని దేశంలో తొలి ట్రాన్స్‌జెండర్ జడ్జి జోయిత్ మోండల్ నొక్కి చెప్పారు. అంతేకాదు ట్రాన్స్‌జెండర్లు పోలీసుఫోర్స్, రైల్వే వంటి కీలక విభాగాల్లో పని చేయడం వల్ల వారి పట్ల సమాజ దృక్పథంలో మార్పు వస్తుందని కూడా ఆమె అన్నారు. శుక్రవారంరాత్రి ఇండోర్‌లో ‘లిట్‌చౌక్’ అనే సాంస్కృతిక, సాహితీ సమ్మేళనంలో పాల్గొన్న అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ జోయితా మోండల్ అన్నారు. అలాగే తన కమ్యూనిటీ సభ్యులు, వారు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల అధికారులు చాలా సున్నితంగా వ్యవహరించాలని ఆమె కోరారు.

ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీకి సరైన వసతి లేదని, ఇందుకోసం ఒక పథకాన్ని ప్రవేశపెట్టాలని అన్నారు. జోయితా మోడల్ 2017లో పశ్చిమ బెంగాల్ లోక్‌అదాలత్‌లో తొలి ట్రాన్స్‌జెండర్ న్యాయమూర్తిగా నియమితులయ్యారు. దేశంలో అలాంటి పదవిని అలంకరించిన తొలి ట్రాన్స్‌జెండర్‌గా నిలిచారు. ఆమె తర్వాత 2018లో మహారాష్ట్రలోని నాగపూర్‌లో లోక్ అదాలత్‌లో న్యాయమూర్తిగా విద్యా కాంబ్లే, అదే ఏడాది గౌహతినుంచి స్వాతి బిధాన్ బరువాలు ఇలాంటి అత్యున్నత పదవిని అలంకరించిన ట్రాన్స్‌జెండర్‌లుగా నిలిచారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News