Wednesday, January 22, 2025

మహిళా కోటాకు ఆమోదం అత్యవసరం..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల కోటాకు ఈసారి పార్లమెంట్‌లో ఆమోదం దక్కాలని బిఆర్‌ఎస్, బిజెడి, వైస్సార్‌సిపి డిమాండ్ చేశాయి. చాలా కాలంగా మహిళా బిల్లు పెండింగ్‌లో ఉంది. మహిళకు న్యాయం దక్కేలా చూడాల్సి ఉంది. గురువారం నుంచి ప్రారంభమయ్యే వర్షాకాల పార్లమెంట్‌లో అయినా ఈ జాప్యం నివారించాల్సి ఉందని కెసిఆర్ నాయకత్వపు బిఆర్‌ఎస్ డిమాండ్ చేసింది. బుధవారం నాటి అఖిలపక్ష భేటీలో బిఆర్‌ఎస్ ఎంపీలు ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు.

ప్రభుత్వం తరఫున అఖిలపక్ష భేటీలో కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, ప్రహ్లాద్ జోషీ పాల్గొన్నారు. మహిళా బిల్లుకు బిఆర్‌ఎస్, వైఎస్‌ఆర్‌సిపి ఇతర పలు పార్టీల మద్దతు దక్కింది. సజావుగా ఈ బిల్లు ఆమోదం దక్కాల్సి ఉందని బిజెడి రాజ్యసభ పక్ష నేత సమ్మిత్ పాత్రా తెలిపారు. ఒడిషాకు చెందిన హో, ముండరి, భూమ్జి తెగలను రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్ చేర్చాల్సి ఉంది. ఈ మేరకు అధికారిక హోదా దక్కాల్సి ఉందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News