Monday, December 23, 2024

మహిళా రిజర్వేషన్ బిల్లులో ఎస్‌సి, ఎస్‌టి, బిసిలకు రిజర్వేషన్లు లేవు….

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మహిళా బిల్లు పెట్టిన ఘనత తమదే అన్నట్టు పిఎం మోడీ గొప్పలు చెబుతున్నారని టిపిసిసి కార్యనిర్వహక అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ చురకలంటించారు. శనివారం మహేష్ మీడియాతో మాట్లాడారు. ఎప్పుడో అమలయ్యే బిల్లుకు ఇప్పుడే హడావుడి చేస్తున్నారని దుయ్యబట్టారు. తక్షణమే మహిళా రిజర్వేషన్లు అమలు చేసే చిత్తశుద్ధి బిజెపికి లేదన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లులో ఎస్‌సి, ఎస్‌టి, బిసిలకు రిజర్వేషన్లు లేవని మహేశ్ కుమార్ గౌడ్ ధ్వజమెత్తారు. ఆరు గ్యారంటీ పథకాలు ప్రజల మదిలో మెదులుతున్నాయని, కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోపే అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఎప్పుడు ఎన్నికలొచ్చినా కాంగ్రెస్ 80 స్థానాలు గెలుస్తుందని మహేశ్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు.

Also Read: గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దు..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News