Monday, December 23, 2024

ఎక్కడ రిజర్వ్ చేసుకుంటే అక్కడే ఎక్కాలి.. లేకపోతే సీటు గల్లంతే!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఒక స్టేషన్ నుంచి రైలు టికెట్ బుక్ చేసుకొని తరువాతి స్టేషన్‌లో రైలు ఎక్కతానంటే ఇప్పటి నుంచి కుదురదు. ఇప్పటినుంచి రైలు రిజర్వేషన్ వివరాలు ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ ట్యాబ్స్ ద్వారా పరిశీలిస్తున్నారు. ఏ స్టేషన్‌లో రిజర్వేషన్ ఉందో చెక్ చేస్తాడు… రిజర్వేషన్ చేసుకున్న వాళ్లు ఎక్కకపోతే వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న వారికి ఆ సీట్లు కేటాయిస్తారు. తరవాతి స్టేషన్‌లో ఎక్కి తనకు సీటు కావాలని ప్రశ్నించడం మాత్రం కుదరదు. గతంలో టిటిఇలకు ప్రింటెడ్ రిజర్వేషన్ లిస్ట్ ఇచ్చే వారు. ఇప్పుడు మాత్రం ట్యాబ్స్ ఇస్తుండడంతో వాళ్లే పేర్లు మార్చి సీట్లను కేటాయిస్తున్నారు. వచ్చే స్టేషన్‌లో రైలు ఎక్కాలంటే ముందుగా బోర్డింగ్ వివరాలు మార్చుకోవాల్సిందేనని రైల్వే అధికారులు వెల్లడించారు.

ఉదాహరణకు నాంపల్లి స్టేషన్ నుంచి రైలు టికెట్ బుక్ చేసుకొని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఎక్కుతానంటే కుదురదు. సికింద్రాబాద్ నుంచి బోర్డింగ్ చేస్తున్నట్టుగా వివరాలు మార్చాల్సి ఉంటుంది. లేకపోతే రిజర్వేషన్ చేసుకున్న టికెట్ మరొకరికి కేటాయించే అవకాశం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News