Monday, December 23, 2024

వాటర్ బోర్డు కాంట్రాక్ట్ పనుల్లో రిజర్వేషన్ అమలు చేయాలి

- Advertisement -
- Advertisement -

డైరెక్టర్ కృష్ణ అజ్మీరకు గిరిజన సంఘం వినతి

మన తెలంగాణ / హైదరాబాద్ : హైదరాబాద్ వాటర్ బోర్డులో కాంట్రాక్ట్ టెండర్స్ లలో రిజర్వేషన్‌లు అమలు చేయాలని తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం.ధర్మానాయక్ ఆధ్వర్యంలో గిరిజన ప్రతినిధి బృందం మంగళశారం వాటర్ బోర్డు డైరెక్టర్ కృష్ణ అజ్మీరాకు వినతి పత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా ధర్మానాయక్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గత ఆరు నెలల క్రితం అన్ని రంగాల్లో రిజర్వేషన్ అమలు చేయాలని జీఓ ఇచ్చినప్పటికీ హైదరాబాద్ వాటర్ బోర్డులో రిజర్వేషన్ అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. తక్షణమే కాంట్రాక్ట్ పనులలో గిరిజనులకు రిజర్వేషన్ కల్పించి గిరిజనులకు అవకాశాలు కల్పించాలని కోరారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో వి. శ్రీహరి నాయక్ ఆర్.శంకర్ నాయక్ తదితరులు ఉన్నారు.

 

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News