Thursday, January 23, 2025

వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో రిజర్వేషన్లు కల్పించాం: పోచంపల్లి

- Advertisement -
- Advertisement -

హన్మకొండ: దేశంలో ఎక్కడా లేని విధంగా వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో రిజర్వేషన్లు కల్పించామని ఎంఎల్‌సి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. పరకాల వ్యవసాయ మార్కెట్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పోచంపల్లి మీడియాతో మాట్లాడారు. బలహీన వర్గాలు సహా ఎస్‌సి, ఎస్‌టి బిడ్డలకు అవకాశాలు కల్పిస్తున్నామని, తెలంగాణ రైతులు, వ్యవసాయం దేశంలోనే అగ్రగామిగా మారిందని పోచంపల్లి కొనియాడారు. ఎన్నికలప్పుడు ఎవరెన్ని మాయమాటలు చెప్పినా గత పదేళ్లలో జరిగిన అభివృద్ధి సంక్షేమాన్ని చూసి నిర్ణయం తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమానికి ఎంఎల్‌సి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎంఎల్‌ఎ చల్లా ధర్మారెడ్డి, ఎంఎల్‌ఎ గండ్రా వెంకటరమణారెడ్డి, జెడ్‌పి చైర్‌పర్సన్ గండ్ర జ్యోతి పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News